ఏపీ ఇంటర్ ద్వితీయ ఫలితాలు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కర్నూలు కలెక్టరేట్‌లో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో 72.07 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇది గత మూడు సంవత్సరాల ఉత్తీర్ణతా శాతం కంటే ఎక్కువ అని మంత్రి గంటా తెలిపారు. ఈసారి ఫలితాల్లో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలవగా, కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే అమ్మాయిలు అబ్బాయిల మీద పైచేయి సాధించారు.