ఏపీలో హైకోర్టు కోసం స్థలం అన్వేషణ
posted on Aug 5, 2015 4:16PM
రెండు రాష్ట్రాల మధ్య హైకోర్టు వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉన్నపాటున హైకోర్టు విభజన జరగాలని మొండి పట్టుదలతో వైఖరిస్తుంది. అయితే ఈ విషయంలో గతంలోనే హైకోర్టు ఇప్పట్లో హైకోర్టు విభజన లేదని ఏపీలో హైకోర్టు నిర్మించుకునేంత వరకు విభజించేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏపీలో హైకోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని చూడాలని.. కేంద్రమే హైకోర్టు నిర్మాణానికి కావాల్సిన వ్యయం చెల్లించాలని స్పష్టం చేసింది. కానీ కేంద్రం మాత్రం ఇప్పటి వరకూ తగిన చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయంపై 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పుడు దీనిపై కేంద్రన్యాయశాఖ మంత్రి సదానందగౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని.. ఏపీ ప్రభుత్వం ఎక్కడ కోరితే అక్కడ హైకోర్టును ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ హైకోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని చెప్పారు.