పట్టిసీమపై టీ సర్కార్ లేఖ.. ఘాటుగా స్పందించిన ఏపీ

 

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గోదావరీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం కూడా ఘాటుగానే సమాధాన మిచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పందించి పట్టిసీమ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టు కాదని, ఇది కొత్త ప్రాజెక్టూ కాదని, మేమేమి ఇతర రాష్ట్రాల నీటిని వాడుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం రాద్దాతం చేస్తుందని అన్నారు. సాకులు చెప్పేముందు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. అసలు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం ఎక్కడుందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో30 కిలోమీటర్లు మేర నీరు సముద్రంలో కలుస్తుందని..సముద్రంలో కలిసే నీరు సద్వినియోగం చేసుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది.