చంద్రబాబు బిజీ బిజీ...

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పలువురు కేంద్రమంత్రులను భేటీ అయ్యారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ విషయంలో కేంద్ర తప్పనిసరిగా సాయం చేయాలని కోరామని తెలిపారు. వెంటనే రాష్ట్రానికి కేటాయించిన నిధులను మంజూరు చేయాలని, రెవిన్యూలోటు ఉన్న ఆంధ్రరాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో సీఎం చంద్రబాబు వివిధ ప్రాజెక్టులు, విద్యాసంస్థల శంకుస్థాపనలు, బహిరంగ సభలతో బిజీబిజీగా గడపనున్నారు. ఆ వివరాలు...

* శనివారం ఉదయం తిరుపతిలో ఐటీ, ఐఐటీ సంస్థల భవనాల నిర్మాణపనులకు శంకుస్థాపన చేసి హైదరాబాద్ చేరుకుంటారు.

* మార్చి 29న పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, తుళ్లూరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవం, బహిరంగసభల్లో పాల్లొంటారు.

* మార్చి 30,31:  సింగపూర్లో పర్యటించనున్నారు. అక్కడ నూతన రాజధాని నిర్మాణ ప్రణాళికపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో పాల్గొంటారు.

* ఏప్రిల్ 1: హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు.

* ఏప్రిల్ 2: కడపజిల్లా ఒంటిమిట్టలో శ్రీసీతారామ కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు.

* ఏప్రిల్ 3: చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో పెప్సికో ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

* ఏప్రిల్ 4, 5: ఢిల్లీలోని భారత ప్రధాని మోదీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చే విందులో పాల్గొంటారు. 5న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొంటారు.

* ఏప్రిల్ 6: గుంటూరులో సుగంధ ద్రవ్యాల పార్క్ ను ప్రారంభిస్తారు.