బైక్ ఎందుకు ఎక్కుతుందని డౌట్ ఉండేది... కానీ
posted on Oct 30, 2015 1:19PM
అనూహ్య రేప్ అండ్ మర్డర్ కేసులో దోషిగా తేలిన క్యాబ్ డ్రైవర్ చంద్రభాన్‌కు ఉరిశిక్ష విధించడంపై అనూహ్య తండ్రి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడేలా ఈ తీర్పు ఉందని ఆయన అన్నారు. చంద్రభాన్ ను తాను చూసినప్పుడు అతనికి తప్పు చేశానన్న బాధ గానీ, భయం గానీ కనబడలేదన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తుపై మొదట్లో కొన్ని అనుమానాలు ఉండేవని, అనూహ్య అసలు ఎందుకు బైక్ ఎక్కుతుంది, అంతదూరం ఎందుకెళ్తుందని డౌట్ వచ్చిందన్నారు. అయితే ముంబై పోలీసులు తాము సేకరించిన సాక్ష్యాలను గురించి తనకు వివరించడంతో నమ్మకం కుదిరిందన్నారు, చంద్రభాన్ తాను క్యాబ్ డ్రైవర్ నని, తనకు కారు ఉందని చెప్పడంతోనే ఆమె రెండో ప్లాట్ ఫాం నుంచి నాలుగో ప్లాట్ ఫారం వచ్చిందన్నారు, అయితే తన సామాన్లు పోతాయనే భయంతోనే అనూహ్య బైక్ పై వెళ్లి ఉంటుందని ఆమె తండ్రి ప్రసాద్ అన్నారు, ఇలాంటి క్రూర మనస్తత్వం కలిగిన వాళ్లకి ఇలాంటి ఉరిశిక్షలు వేయకపోతే మహిళలపై అఘాయిత్యాలు మరింత పెరిగిపోతాయని, నాలుగురోజులు జైల్లో ఉంటే సరిపోతుందిలే అనుకుంటారని అనూహ్య తండ్రి అభిప్రాయపడ్డారు.