ఫెమినిస్ట్ ఐకాన్‌గా జోలీ

 

హాలీవుడ్ స్టార్ ఏంజిలినా జోలి మంచి నటిగా మాత్రమే కాకుండా... మానవతావాదిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆమె అనేక సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ వుంటారు. తాజాగా జోలీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. బ్రిటన్లో ఆమె టాప్ ఫెమినిస్ట్ ఐకాన్గా నిలిచారు. ఆమె ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్నారు. ఏంజిలీనా జోలీ ఈమధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సేవకు గాను ఆమె ఈ ఏడాది బ్రిటన్ ఫెమినిస్ట్ ఐకాన్గా నిలిచారు. 'మేం మహిళ స్వశక్తితోనే ముందుకు వెళుతున్నాం. వారి ఘనతకు గుర్తింపుగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల హక్కుల విషయంలో ఏంజిలినా చాలా చక్కగా పనిచేస్తున్నారు' అని ఫెమినిస్ట్ ఫ్యాషన్ వ్యవస్థాపక అధ్యక్షులు హైడీ రహ్మాన్ తెలిపారు.