నీట్ ఆర్డినెన్స్ పై స్టే.. నో చెప్పిన సుప్రీం..

 

నీట్ పై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఓ మెడికో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ పై స్టే విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు..  ప్రస్తుత పరిస్థితుల్లో నీట్‌ ఆర్డినెన్స్‌పై స్టే విధిస్తే దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని పేర్కొంది. సదరు పిటిషన్ ను తోసిపుచ్చింది.