అజహర్... ముచ్చటగా మూడో పెళ్ళి
posted on Dec 20, 2015 10:55PM

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజహరుద్దీన్ ముచ్చటగా మూడో పెళ్ళి చేసుకున్నాడు. అజహర్ వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. ఆయన అమెరికాకు చెందిన షానన్ మేరీని వివాహం చేసుకున్నట్టు సమాచారం. 2013 నుంచీ వీరిద్దరూ స్నేహితులట. వీరిద్దరూ పెళ్ళి చేసుకుని ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీలో హనీమూన్ కోసం వచ్చారని మహారాష్ట్రకు చెందిన ఒక పత్రిక కథనాన్ని ఇచ్చింది. అజహర్ గతంలో మొదట నౌరీన్ అనే యువతిని పెళ్ళాడాడు. ఆమెకు తలాక్ చెప్పేసి సంగీతా బిజిలానీని పెళ్ళాడాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు షానన్ మేరీని వివాహం చేసుకున్నాడు. ముస్లిం, హిందూ, క్రైస్తవ... ఈ మూడు మతాలకూ చెందిన వారిని పెళ్ళి చేసుకుని తనకు ‘మత అసహనం’ లేదని నిరూపించిన అజహర్‌కి మూడోపెళ్ళి శుభాకాంక్షలు.