Home » Fashion » చలికాలంలో పార్టీస్.. ఈ డ్రెస్సులతో ధూమ్ ధామ్ లుక్ వచ్చేస్తుంది..!
చలికాలంలో పార్టీస్.. ఈ డ్రెస్సులతో ధూమ్ ధామ్ లుక్ వచ్చేస్తుంది..!

వేసవికాలంలో ఎండలు మండినట్టు చలికాలంలో చలి వణికిస్తుంది. వద్దనుకున్నంత మాత్రాన ఇవన్నీ మాయమైపోవు. వాతావరణానికి తగ్గట్టు మనుషులే మారాలి. ఆహారం, వస్త్రధారణ అలవాట్లు మార్చుకోవాలి. అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి డ్రస్సులు వేసుకున్నా చెల్లుతుంది. కానీ పార్టీలు, ఫంక్షన్లకు చాలా అందంగా తయారై వెళ్లాలి. చలి కారణంగా అందంగా, అట్రాక్షన్ గా తయారవ్వడం కాసింత కష్టం అనిపిస్తుంది. కానీ అమ్మాయిలు ఈ చలికాలంలో అందంగా, ఆకర్షణగా కనిపించడానికి కొన్ని డ్రస్సులు ఉన్నాయి. వాటిని ధరిస్తే పార్టీలో సెంటరాప్ అట్రాక్షన్ గా ధూమ్ ధామ్ లుక్ లో కనిపిస్తారు. ఆ డ్రస్సులేంటో ఒక లుక్కేస్తే..
కో ఆర్డర్ సెట్..
పార్టీస్ లో అట్రాక్షన్ గా కనిపించడానికి కో ఆర్డర్ సెట్ చాలా బాగుంటుంది. వెచ్చని క్రాప్ టాప్ తో అటాచ్ చేయాలి. పైన బ్లేజర్ వేసుకోవడం వల్ల చాలా అట్రాక్షన్ వచ్చేస్తుంది. క్యాజువల్ అమ్మయి అనే ట్యాగ్ పక్కన పెట్టి లేడీ బాస్ టైప్ ట్యాగ్ ఇచ్చేస్తారు. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు పోనీ టైల్ వేస్తే ఇంకా అధిరిపోతుంది.
లాంగ్ స్టైల్..
లేయరింగ్ ఇష్టపడే అమ్మాయిలు లాంగ్ డ్రెస్ లను నల్లటి స్కివ్వీస్ తో జత చేసి వేసుకోవచ్చు. ఈ డ్రెస్ లో హీల్స్ ధరిస్తే క్లాసీ లుక్ వచ్చేస్తుంది. దీనికి ఐ మేకప్ మరింత అట్రాక్షన్ తెస్తుంది. హెయిర్ ను అలా లూస్ గా వదిలేస్తే అదిరిపోతుంది.
బాడీకాన్ తో భలే..
రంగు ఏదైనా సరే.. బాడీకాన్ డ్రెస్ లు చాలా బాగుంటాయి. అమ్మాయిలకు ఈ డ్రెస్ ఇచ్చే ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఇలాంటి డ్రెస్ కు ఫ్లీస్ లెగ్గింగ్స్ జతచేయాలి. డ్రెస్ పైన స్టూల్ లేదా బ్లేజర్ ధరిస్తే కంప్లీట్ లుక్ సొంతమైనట్టే. ఇది పార్టీకి బిగ్గెస్ట్ అట్రాక్షన్ అవుతుంది. నార్మల్ లుక్ ను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది.
కంఫర్ట్ లుక్..
దుస్తులను వివిధ రకాలుగా ధరించడం వల్ల లుక్ అయితే బాగుంటుంది కానీ కొన్ని సార్లు అవి అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. అలా కాకుండా కంఫర్ట్ గా ఉంటూ పార్టీస్ కు అటెండ్ అయ్యి అట్రాక్షన్ గా నిలవాలంటే ఒక మంచి టాప్, దానితో ఫిట్టెడ్ జీన్స్ ధరించాలి. టాప్ పైన మంచి జాకెట్ ఒకటి ధరించాలి. హెయిర్ ను లూస్ గా వదిలేసి తలకు ఒక మంచి క్యాప్ ధరించాలి. ఈ డ్రెస్ కు హై లెంగ్త్ బూట్ లు వేసుకుంటే భలే కనిపిస్తారు.
]పైన చెప్పుకున్నవే కాకుండా దుస్తుల పట్ల మంచి అభిరుచి ఉన్నవారు తమ దగ్గరున్న దుస్తులనే కాంబినేషన్ మారుస్తూ మంచి ఔట్ ఫిట్ ను రెఢీ చేసుకోవచ్చు. కొత్త ఫ్యాషన్ ను క్రియేట్ చేయవచ్చు.
*రూపశ్రీ.

