Home » Fashion » పార్టీకి వెళ్లే ప్రతి అమ్మాయి బ్యాగ్ లో ఉండాల్సిన మేకప్ వస్తువులు ఇవి!
పార్టీకి వెళ్లే ప్రతి అమ్మాయి బ్యాగ్ లో ఉండాల్సిన మేకప్ వస్తువులు ఇవి..!

పార్టీలు నేటికాలంలో చాలా కామన్. పుట్టిన రోజు నుండి చిన్నచిన్న విజయాల వరకు, స్పెషల్ డేస్ ను కూడా వదలకుండా ప్రతి మూమెంట్ ను పార్టీగా ఎంజాయ్ చేస్తారు నేటి తరం. ఇప్పట్లో పార్టీ అంటే అమ్మాయిలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. పార్టీలకు వెళ్ళాలంటే అమ్మాయిలు చాలా కసరత్తు చేస్తారు. డ్రస్సింగ్ నుండి దానికి ప్రతిదీ మ్యాచింగ్ ఉండేలా చూసుకోవడమే కాకుండా మంచి మేకప్ వేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. అయితే ఇంటి వద్ద మేకప్ వేసుకోవడమే కాకుండా.. పార్టీకి వెళ్లే ప్రతి అమ్మాయి తప్పకుండా 5 మేకప్ వస్తువులను తన వెంట బ్యాగ్ లో తీసుకెళ్లాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ 5 మేకప్ వస్తువులు ఏంటో.. అవి ఎందుకు అంత ముఖ్యమూ తెలుసుకుంటే..
కాంపాక్ట్ పౌడర్..
పార్టీలలో డ్యాన్స్ చేయడం, పరిగెత్తడం వల్ల పదే పదే చెమట పడుతూ చర్మం జిడ్డుగా మారుతుంది. దీని వలన మేకప్ ప్యాచ్ లు గా కనిపిస్తుంది. కాంపాక్ట్ పౌడర్ వెంట తీసుకెళ్తే అది వెంటనే ముఖానికి మ్యాట్, ఫ్రెష్ లుక్ ఇస్తుంది. ఇది స్కిన్ టోన్‌ను సమం చేస్తుంది. ఎక్కువ మేకప్ వేయకుండానే ముఖాన్ని శుభ్రంగా, దోషరహితంగా కనిపించేలా చేస్తుంది. ఇది T-జోన్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
లిప్ స్టిక్, లిప్ టెంట్..
పార్టీలలో తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు లిప్‌స్టిక్ చెదిరిపోతూ ఉంటుంది. వీటి వల్ల పెదాలను అందంగా ఉంచే లిప్‌స్టిక్ ఎక్కువ సేపు ఉండదు. అందుకే ఎక్కువ సేపు ఉంటూ చెదిరిపోకుండా ఉండే లిప్ స్టిక్ వేసుకోవాలి. లేదా హ్యాండ్ బ్యాగ్ లో ఒకమంచి లిప్ స్టిక్ తప్పనిసరిగా ఉండాలి. ఇది మొత్తం లుక్‌ను అప్పటికప్పుడే రిఫ్రెష్ చేస్తుంది. ఏ పార్టీ లుక్‌కైనా న్యూడ్ లేదా ఎరుపు రంగు బాగుంటుంది.
కాజల్, ఐలైనర్..
మేకప్‌లో కళ్ళు అతి ముఖ్యమైన భాగం. మస్కారాను పూయడం లేదా ఐలైనర్‌ను రంగు మార్చడం వల్ల మొత్తం లుక్ దెబ్బతింటుంది. బ్యాగ్ లో మస్కారా లేదా ఐ లైనర్ లేదా కాజల్ తప్పని సరిగా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే అవి లుక్‌ను మళ్లీ షార్ప్‌గా ఆకర్షణీయంగా మార్చుకోవడానికి సహాయపడతాయి.
బ్లాటింగ్ పేపర్..
ఎక్కువ మేకప్ వేసుకోకూడదనుకుంటే బ్లాటింగ్ పేపర్లు ఒక గొప్ప ఛాయిస్. అవి ముఖం నుండి అదనపు నూనెను గ్రహిస్తాయి, మేకప్‌ను పాడుచేయవు. ఇది జిడ్డు చర్మం ఉన్నవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
సెట్టింగ్ స్ప్రే..
పార్టీ-టైమ్స్ ఎక్కువసేపు ఉంటాయి. మేకప్ త్వరగా మసకబారుతుంది. మేకప్ సెట్టింగ్ స్ప్రే మేకప్‌ను లాక్ చేసి ఎక్కువసేపు తాజాగా కనిపించేలా చేస్తుంది. ఇది పగుళ్లను నివారిస్తుంది, సహజమైన మెరుపును ఇస్తుంది.
పైన చెప్పుకున్న వస్తువులు పార్టీకి వెళ్లే ప్రతి అమ్మాయి బ్యాగ్ లో తప్పనిసరిగా ఉంచుకుంటే పార్టీ పూర్తయ్యే వరకు మేకప్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా గడిచిపోతుంది.
*రూపశ్రీ.

