Home » Fashion » వేసవిలో కూల్ గా స్టైలిష్ గా ఉంచే ఫ్యాషన్ చిట్కాలు..!
వేసవిలో కూల్ గా స్టైలిష్ గా ఉంచే ఫ్యాషన్ చిట్కాలు..!

వేసవి అనగానే చిరాకు భావన పుడుతుంది చాలా మందికి. ముఖ్యంగా వస్త్రధారణ, బయటకు వెళ్లడం, ప్రయాణాలు, ఉక్కపోతలో పనిచేయడం.. ఇవన్నీ గుర్తుకు వస్తే వేసవి అంటే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. వేసవిలో చెమట, జిగటగా ఉండటం, సౌకర్యం అనేవి ప్రధాన సమస్యలు. సరైన దుస్తులు ఎంచుకోవడం ద్వారా రోజును సౌకర్యవంతంగా , కూల్ గా, స్టైలిష్‌గా మార్చుకోవచ్చు. వేసవికి తేలికైన, గాలి ప్రసరించే , చెమటను పీల్చుకునే దుస్తులు ఉత్తమమైనవి. వేసవి కాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలో, ఏ రకమైన దుస్తులు ఎలాంటి సౌకర్యాన్ని ఇస్తాయో.. సమ్మర్ లోనూ కూల్ గా, స్టైలిష్‌గా ఉండటానికి సులభమైన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
కాటన్..
వేసవిలో కాటన్ అత్యంత ప్రజాదరణ పొందిన వస్త్రం. ఇది తేలికగా, మృదువుగా , చెమటను పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది, అందువల్ల రోజువారీ ధరించడానికి ఇది చాలా అనువైనది. వేసవి ప్రారంభం కాగానే, పత్తి వస్త్రాలు మార్కెట్‌ను ముంచెత్తుతాయి. వార్డ్‌రోబ్‌లో కుర్తీలు, షర్టులు , టాప్‌లతో సహా అనేక రకాల కాటన్ వస్త్రాలు ఉంటే వేసవిలో ఆహ్లాదంగా గడిపేయవచ్చు.
లినెన్..
లినెన్ చాలా గాలి ఆడే, చల్లని వస్త్రం. ఇది ఆఫీసుకు , బయటి ప్రయాణాలకు రెండింటికీ అనువైనది. ఈ సీజన్‌లో లినెన్ షర్టులు అత్యంత సౌకర్యవంతమైన , స్టైలిష్ రూపాన్ని అందిస్తాయి.
రేయాన్..
వేసవి కలెక్షన్‌లో రేయాన్ వస్త్రాలను చేర్చాలి. రేయాన్ స్టైలిష్‌గా , తేలికగా ఉంటుంది, కాబట్టి ఇది పార్టీలకు , క్యాజువల్ వేర్‌కు చాలా అనువైనది.
ఖాదీ..
ఖద్దరు అనేది వేసవి వేడిలో చల్లదనాన్ని అందించే ఒక సహజమైన వస్త్రం. జాతిపరమైన , సాంప్రదాయ లుక కు ఖద్దరు వస్త్రం చాలా అనువైనదిగా పరిగణించబడుతుంది. ఖద్దరు వస్త్రం అనేక రకాల డిజైన్ ఎంపికలను కూడా అందిస్తుంది.
షిపాన్..
షిఫాన్ అనేది తేలికైన , గాలికి రెపరెపలాడే వస్త్రం, ఇది స్టైలిష్ రూపాన్ని ఇస్తుంది. ఈ వస్త్రం వేసవి పార్టీలు ,ఫంక్షన్లకు చాలా అనువైనది. షిఫాన్ అనేక రకాల ఆకర్షణీయమైన , అందమైన చీరలను అందిస్తుంది, ఇవి సౌకర్యవంతంగా ఉండి, ఏ మీటింగ్స్ లో అయినా క్లాసీ రూపాన్ని ఇస్తాయి.
జార్జెట్..
జార్జెట్ తేలికైన , గాలి ప్రసరించే వస్త్రం . ఇది ట్రెండీ, న్యూ లుక్స్ కూడా చాలా అనువైనది. జార్జెట్‌లో ఇండో-వెస్ట్రన్ దుస్తులు, పలాజో సెట్లు, కుర్తాలు లేదా చీరలతో సహా అనేక రకాల ఛాయిస్ మార్కెట్లో ఉంటాయి.
*రూపశ్రీ.
