Home » Fashion » ఇయర్ కఫ్ డిజైన్స్.. చీరల నుండి వెస్ట్రన్ దుస్తుల వరకు.. అద్దిరిపోయే లుక్ కావాలంటే ఈ ఇయర్ కఫ్ లు ట్రై చేయండి..!

ఇయర్ కఫ్ లు.. చెవులు కుట్టించుకోకపోయినా అందంగా చెవులను అలంకరించుకోవడానికి చాలా సహాయపడతాయి. ప్రస్తుతం అయితే ఈ ఇయర్ కఫ్ లు చాలా ట్రెండీ యాక్సెసరీస్ అని చెప్పవచ్చు. ఇయర్ కఫ్ లలో చాలా రకాల డిజైన్లు, ఎంతో అందంగా ఉన్నవి మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. రూపానికి తగ్గట్టు ఇయర్ కఫ్ లను ఎంచుకుని ధరించడం వల్ల కంప్లీట్ లుక్ చాలా మారిపోయి,  అదరహో అనిపిస్తుంది. ఇయర్ కఫ్ లు ధరించడం వల్ల గ్లామర్ పెరిగినట్టు అనిపిస్తుంది, ఎంతో మెస్మరైజింగ్ గా కూడా అనిపిస్తుంది. పైగా ఏ దుస్తులకైనా ఇట్టే సరిపోయే మోడల్స్ ఇప్పట్లో ఎన్నో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఇయర్ కఫ్ ల గురించి మరికాస్త తెలుసుకుంటే..

పికాక్ డిజైన్..

నెమలి డిజైన్ ఇయర్ కఫ్స్ ఎప్పటికీ కొత్తగానే ఉంటున్నాయి.  ఎన్నేళ్లు మారినా వీటికి ఆదరణ తగ్గడం లేదు.  ఈ టైప్ ఇయర్ కఫ్స్ తయారు చేసిన విధానం, వీటి ఆకృతి,  వీటిని దరించినప్పుడు కనిపించే ఆ రాయల్ లుక్ నార్మల్ గా ఉన్న అమ్మాయిలకు కూడా చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది.  అలాగే ఇవి ధరించినప్పుడు అటు సంప్రదాయ బద్దంగానూ, ఇటు క్లాసీగా ఉంటూనే మెస్మరైజింగ్ లుక్ ను ఇస్తుంటాయి.

ముఖ్యంగా రాళ్లు పొదిగిన పీకాక్  ఇయర్ కఫ్స్ పార్టీలు లేదా పండుగ సందర్భాలలో చాలా అట్రాక్షన్ గా, అద్బుతమైన లుక్ ను ఇవ్వడంలో సహాయపడతాయి.

ఫ్రింజ్ డిజైన్..

పొరలుగా, కుచ్చులతో ఉండే ఫ్రింజ్ ఇయర్ కఫ్స్ ఈ రోజుల్లో బాగా ఫేమస్ అయ్యాయి. ఇవి చెవులకు నిండుగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. వీటిలో వేలాడే ముత్యాలు, సున్నితంగా ఉండే చైన్ లు , గంటలు.. వీటిని ఎప్పుడు ధరించినా గ్రేట్ లుక్ ఇస్తాయి.

వీటిని చీరలు, లెహంగాలు లేదా ఇండో-వెస్ట్రన్ దుస్తులతో చాలా ఈజీగా మాచ్  చేయవచ్చు. ముఖ్యంగా బనారసి లేదా పట్టు చీరలు రాజసం ఉట్టిపడేలా ఉంటాయి, అందుకే అవి పెళ్లికూతురి అలంకరణకు చాలా చక్కగా సరిపోతాయి.
 
ముత్యాల డిజైన్..

ముత్యాల చెవిపోగులు ఎంతో నాజూగ్గా ఉంటాయి.  ఇవి  అందరి దృష్టిని ఆకర్షిస్తాయి , ఎప్పటికీ ఫ్యాషన్ నుండి పక్కకు పెట్టడానికి వీలు లేకుండా ఎంతో అందంగా ఉంటాయి.

ముత్యాలు చాలా మృదువుగా, హుందాగా ఉండటం వల్ల  అన్ని వయసుల మహిళలకు నప్పుతాయి.  కాలేజీ , ఆఫీస్ అమ్మాయిలు ముత్యాల చెవిపోగులను ఎక్కువగా ఇష్టపడతారు.

సాంప్రదాయ దుస్తుల నుండి పాశ్చాత్య దుస్తుల వరకు, అవి ప్రతి డ్రెస్సింగ్ కు మంచి అందాన్ని ఇస్తాయి.  ముఖ్యంగా పట్టు లేదా షిఫాన్ చీరలతో ఇవి చాలా హుందాగా కనిపిస్తాయి, ఆకర్షణ పెంచుతాయి.

ఇండో-వెస్ట్రన్ నీడిల్ కఫ్..

నీడిల్ ఇయర్ కఫ్స్ సన్నని సూది లాంటి డిజైన్‌లో వస్తాయి. ఇవి చెవిలో సులభంగా సరిపోతాయి. ఇవి చాలా సున్నితంగా,  సరళంగా ఉండటం వల్ల వాటిని ఏ దుస్తులతోనైనా ధరించవచ్చు. ముఖ్యంగా ఇండో-వెస్ట్రన్ లుక్‌తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఇందులో చాలా రంగులు, అర్ధచంద్రాకార ,  తామర పువ్వుల డిజైన్‌లు ఉంటాయి.  వీటిని చాలా స్పెషల్ గా ఇష్టపడతారు. లుక్ కు తగ్గట్టు సింపుల్ గా,  అట్రాక్షన్ గా కనిపించాలంటే.. సంప్రదాయ దుస్తులతో వీటిని ధరించడం చాలా మంచిది.

ఝుమ్కీ డిజైన్..

సాధారణ కుర్తీ లేదా చీరలో ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే ఝుమ్కీ డిజైన్ ఇయర్ కఫ్స్‌ను ఎంచుకోవచ్చు.  ఇవి చూడటానికి బరువుగా అనిపించినా, చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

చైన్, మల్టీ-లేయర్ లేదా కుందన్ ఝుంకీ కఫ్స్ వంటి డిజైన్లు  డిఫరెంట్ గా కనిపించేలా చేస్తాయి. ఇవి చీరతో చాలా అందంగా కనిపిస్తాయి, అదే కుర్తీతో అయితే అట్రాక్షన్ లుక్ ఇస్తాయి. కుందన్ ఝుమ్కీ ఇయర్ కఫ్స్ లెహంగాతో పెళ్లికూతురి రూపాన్ని మరింత వైభవంగా మార్చగలవు.
 
                                                                                                                                                  *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.