Home » Ladies Special » గర్భధారణ సమయంలో, బరువు ఎంత పెరగాలి.నిపుణుల సలహాలు..

తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలో అత్యంత అద్భుతమైన మరియు భావోద్వేగభరితమైన ప్రయాణం. అయితే ఈ ప్రయాణం సజావుగా సాగాలంటే గర్భధారణకు ముందే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. దీనినే ప్రీ కన్సెప్షన్ న్యూట్రిషన్ అంటారు. అంటే మనం ముందుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కన్సీవ్ అయితే, అన్ని పోషకాహార లోపాలను సరిచేసుకొని పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండవచ్చు. దీనివల్ల కాబోయే బిడ్డ ఆరోగ్యం కూడా వంద శాతం అద్భుతంగా ఉంటుంది. సుమారుగా 50 శాతం మంది భారతీయ మహిళల్లో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఎనీమియా సమస్య వేధిస్తుంది. అలాగే బి కాంప్లెక్స్, విటమిన్ బి12 మరియు విటమిన్ డి లోపాలు కూడా సాధారణంగా కనిపిస్తాయి. మొదటి 12 వారాల్లోనే బిడ్డకు సంబంధించిన నరాల అభివృద్ధి మరియు వెన్నెముక నిర్మాణం వేగంగా జరుగుతుంది. అయితే చాలా మంది మొదటి మూడు నాలుగు నెలల వరకు తమ ప్రెగ్నెన్సీని గుర్తించలేకపోవచ్చు. అందుకే కనీసం ఆరు నెలల నుంచి లేదా ఒక సంవత్సరం ముందే డైట్ సరిచేసుకోవడం ఉత్తమం. ఫోలిక్ యాసిడ్ లోపం రాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పండ్లు, నట్స్ మరియు సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు బేబీ కోసం డబుల్ డబుల్ తినాలని, క్రేవింగ్స్ వస్తే అస్సలు కంట్రోల్ చేసుకోకూడదని చెబుతుంటారు. కానీ శాస్త్రీయంగా చూస్తే అన్ని పోషకాలు నిండిన సమతుల్యమైన ఆహారం తీసుకోవడమే సరైన పద్ధతి. ఒక చిన్న సింగర కణంతో మొదలై పూర్తి బిడ్డగా రూపాంతరం చెందే క్రమంలో ప్రొటీన్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా తల్లి శరీర బరువును బట్టి ప్రతి కేజీకి ఒక గ్రాము నుంచి ఒకటిన్నర గ్రాముల వరకు ప్రొటీన్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉండే సగటు భారతీయ మహిళ రోజువారీగా 60 నుంచి 80 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి. కానీ మనం సాధారణంగా తీసుకునే శాఖాహారంలో కేవలం 30 నుంచి 40 గ్రాముల ప్రొటీన్ మాత్రమే అందుతుంది. అందువల్ల ప్రతి పూట మీల్‌లో పప్పు దినుసులు, గుడ్లు లేదా తగినంత ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి.

గర్భధారణ సమయంలో బరువు పెరుగుదల చాలా పద్ధతిగా ఉండాలి. సాధారణ బరువు ఉన్న తల్లులు ప్రెగ్నెన్సీ సమయంలో 12 నుంచి 13 కిలోల వరకు బరువు పెరగడం సహజం. కానీ అనారోగ్యకరమైన ఈటింగ్ అలవాట్ల వల్ల కొందరు 20 నుంచి 30 కిలోల వరకు విపరీతంగా పెరుగుతుంటారు. రోజూ ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు, జంక్ ఫుడ్ తినడం వల్ల అనవసరమైన కొవ్వు పెరిగి తల్లులకు డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఈ కాలంలో షుగర్ లెవెల్స్ పెరిగే సమస్య సుమారు 40 శాతం మందిలో కనిపిస్తోంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ఆరంభం నుంచి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, సరైన మోతాదులో బరువు పెరుగుతూ, ప్లాన్డ్ డైట్ పాటిస్తే తల్లి మరియు బిడ్డ ఇద్దరూ అత్యంత ఆరోగ్యంగా ఉంటారు.

 

 

First trimester diet plan, what to eat in first 3 months of pregnancy, early pregnancy nutrition, pregnancy food tips, folic acid foods for pregnancy, morning sickness home remedies, foods to avoid in first trimester.
 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.