Home » Yoga » indoor exercises to keep you fit during monsoon,Monsoon Health,5 Yoga Asanas,Yoga Asanas
వర్షాకాలంలో ఫిట్నెస్ విషయంలో బెంగా.. అయితే ఈ ఆసనాలు వేసి చూడండి!
ఫిట్ గా ఉండటం కోసం మహిళలు చాలా కష్టపడతారు. కానీ వారి కష్టానికి వాతావరణం శత్రువుగా మారే సందర్బం ఇది. ఈ వర్షాకాలంలో మహిళలు ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడం కాస్త కష్టం. తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల మధ్య వ్యాయామాలు, ఇతర వర్కౌట్లు చేయడం కాస్త కష్టం. అయితే దీనికి కూడా చక్కని పరిష్కారముంది. తేమతో కూడిన వాతావరణంలో నీటిని సరిపడినంతగా తీసుకుంటూ కాసింత గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలోనే యోగా చేయడం వల్ల మహిళల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే..
సూర్య నమస్కారాలు..
సూర్యనమస్తారంలో వేసే భంగిమలు క్రమంగా శరీరాన్ని వేడెక్కేలా చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీలంలో పట్టుత్వాన్ని పెంచుతుంది. సూర్యనమస్కార భంగిమలను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడ శరీరంలో వివిధ అవయవాలు సుష్టంగా మారతాయి, ఇది అంతర్గత ముఖ్యమైన అవయవాలు మెరుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. రిథమిక్ శ్వాస , కదలికలు ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో ఉత్తేజాన్నిస్తాయి. సాధారణ అభ్యాసంతో.. శరీరం, శ్వాస, శరీరంలో చైతన్యం మధ్య లోతైన సంబంధాన్ని ఏర్పరుచుకునే అవగాహనను పెంచుతుంది.
త్రికోణాసనం..
త్రికోణాసనం శరీరంలో ముఖ్యంగా ఛాతీ భాగాన్ని యాక్టీవ్ చేస్తుంది. నిలబడుకుని ఉన్నప్పుడు ఇది భుజాలను సాగదీయడానికి సహాయపడుతుంది. శరీరం సమతుల్యంగా ఉండేలా చేస్తుంది.
శలభాసనం..
దీనినే మిడత భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం శరీరం వెనుక భాగంలో ఉండే కండరాలను యాక్టీవ్ చేస్తుంది. వీపు దిగువ భాగాన్ని బలపరుస్తుంది.
భుజంగాసనం..
భుజంగాసనం లోతైన శ్వాసను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు, ఛాతీ ఆరోగ్యం దృఢంగా మారడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది.
బాలాసనం..
బాలాసనం శరీరానికి మంచి ఓదార్పును ఇచ్చే భంగిమ. ఈ భంగిమలో వెనుక తుంటి భాగంను సాగదీసేటప్పుడు శరీరం విశ్రాంతి దశలోకి వెలుతుంది. ఈ కారణంగా ఇది శరీరానికి మంచి విశ్రాంతి అనుభూతి ఇస్తుంది.
శవాసనం..
సాధారణంగా వెల్లికిలా శరీరాన్ని చాలా వదులుగా ఉంచి పడుకోవడమే శవాసనం. ఈ ఆసనంలో శరీరం చాలా విశ్రాంతి దశలో ఉంటుంది. దీని కారణంగా శరీరంలో ఉష్ట్రోగ్రతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.
*నిశ్శబ్ద.