Chandi Movie Review
on Nov 9, 2013
Cast: Priyamani, sarath Kumar, Krishnam Raju
Director: Samudra
కథ :
అల్లూరి సీతారామరాజు వంశంలో నాలుగో తరం అయిన చండీ (ప్రియమణి) హైదరాబాద్ లో చంద్ర శేఖర్ ఆజాద్ (శరత్ కుమార్) సహాయంతో కొన్ని హత్యలు చేస్తుంది. సిబిఐ ఆఫీసర్ శ్రీమన్నారాయణ (నాగబాబు) ఆమెను పట్టుకునే ప్రయత్నంలో ఉంటె, చండీ మాత్రం సమాజానికి చెడు చేస్తున్న వ్యక్తులను చంపుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇదే క్రమంలో మినిస్టర్(ఆశిష్విద్యార్ధి ) తమ్ముడు బంగార్రాజు (సుప్రీత్) ని చండీ చంపేస్తుంది. దాంతో చండీని చంపే ప్రయత్నాలలో మినిస్టర్ ఉంటాడు. అసలు చండీ ఎవరు? ఇలా అందరిని ఎందుకు చంపేస్తుంది? మరి ఇందులో కృష్ణంరాజు పాత్ర ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే...
నటీనటుల పనితీరు :
చండీ పాత్రలో ప్రియమణి తన నటన, అందాలతో ఆకట్టుకున్నది. కాని నటన పరంగా కాస్త ఓవర్ చేసినట్లుగానే అనిపిస్తుంది. కృష్ణంరాజు
పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. శరత్ కుమార్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారు.గబ్బర్ సింగ్ పాత్రలో పోసాని, సి బి ఐ ఆఫిసేర్ గా వచ్చిన నాగబాబు అసలు ఆకట్టుకోలేకపోయారు. మిగిలిన నటులందరు కూడా ఎదో తమ వంతు ప్రయత్నాలు చేశారు.
సాంకేతిక వర్గం :
సరైన కథ లేకపోతే కథనం ఎలా ఉంటుందో అలానే ఉంది. దర్శకుడు ఈ సినిమాను బాగా తీద్దామని అనుకొని, జనాలకు నీరసం వచ్చేలా
తీసాడు.కొన్ని డైలాగ్స్ కి అయితే జనాలకు చిరాకు తెప్పించాయి. సినిమాటోగ్రఫీ పరవాలేదు. సంగీతం కూడా అబ్బో అని అనిపించేలా
ఉంది. సాంకేతికంగా కూడా అంతగా మెప్పించలేకపోయింది.
ప్లస్ పాయింట్స్ :
హీరోయిన్ అందాలు
మైనస్ పాయింట్స్ :
ఉన్నదే అది.
విశ్లేషణ :
అనుష్కతో "పంచాక్షరి" చిత్రంతో విజయం సాధించలేకపోయిన సముద్ర.. కొంచెం కథను అవినీతిపై పోరాడే చండీగా మార్చి తెరకెక్కించాడు. కానీ.. ఈ చిత్రంలో టార్చర్ తప్ప ఇంకేం లేక జనాలకు చిరాకును తెప్పించాయి. అగ్ర నటులు కృష్ణంరాజు, శరత్ కుమార్, నాగబాబు వంటి వారు కూడా ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమాలోని డైలాగ్స్ వింటూనే నేరాలు ఘోరాలు చుసినట్లుగానే అనిపిస్తున్నాయి.
ప్రతి సన్నివేశాన్ని అల్లూరి సీతారామరాజు కాలంతో పోల్చడం, అసలు ఈ సినిమాలో సీతారామరాజు అంటే కృష్ణంరాజు గుర్తొస్తారు. కానీ
మళ్ళీ పెద్ద ఎన్టీఆర్ ను ఎందుకు చూపించారో అర్థం కాలేదు. సముద్ర అనుకున్న కథ కాస్త అంగట్లో దొరికే వస్తువులగా అనిపించింది. అంగట్లో దొరికే వస్తువులన్నిటిని కలిపితే మార్కెట్ అయినట్లే.. సమాజంలో జరిగేవి, అల్లూరి కాలంలో జరిగినవి ఎం దొరికితే ఆ విషయాలన్నీ కలిపి సినిమా తీస్తే జనాలు చూస్తారని అనుకున్నట్లున్నాడు సముద్ర.
చివరగా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... చండీతో హిట్టు కొడదామనుకున్న ప్రియమణి, సముద్రలకు... ఈ సినిమా జనాల బెండు తీసేలా ఉంది.
Rating: 1.5/5