![]() |
![]() |

'హిట్' ఫేమ్ శైలేశ్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ 75వ సినిమా తెరకెక్కనుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2 గా ఈ చిత్రం రూపొందనుంది.
గతేడాది మేలో విడుదలైన 'ఎఫ్-3' తర్వాత వెంకటేష్ కొత్త సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన 75వ సినిమా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. చిత్రాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 'శ్యామ్ సింగ రాయ్' తర్వాత నిహారిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న సినిమా కావడంతో 'వెంకీ75'పై అందరిలో ఆసక్తి నెలకొంది. పైగా 'హిట్-1', 'హిట్-2' చిత్రాలతో ప్రతిభ కనబరిచి విజయాలు అందుకొన్న శైలేశ్ కొలను ఈ సినిమాకి దర్శకుడు కావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు బుధవారం(జనవరి 25న) తెలియనున్నాయి.

![]() |
![]() |