![]() |
![]() |
.jpg)
విక్టరీ వెంకటేష్ సరసన కనువిందు చేసిన నాయికల్లో అంజలా ఝవేరి ఒకరు. బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమించుకుందాం.. రా!(1997) కోసం ఈ జంట తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. విశేషమేమిటంటే.. ఆ సినిమాతో అంజలా ఫస్ట్ టైమ్ తెలుగు తెరపై మెరిశారు. ఆ తరువాత మళ్ళీ నాలుగేళ్ళ తరువాత దేవీపుత్రుడు(2001)లో ఈ ఇద్దరు పెయిర్ అప్ అయ్యారు.
విశేషమేమిటంటే.. వెంకీ, అంజలా ఝవేరి కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలకీ స్వరబ్రహ్మ మణిశర్మనే సంగీతమందించారు. ప్రేమించుకుందాం..రా!కి మూడు పాటలతో పాటు నేపథ్య సంగీతాన్ని కూడా మణిశర్మనే అందించగా.. దేవీపుత్రుడుకి కూడా ఈ మెలోడీబ్రహ్మనే స్వరకర్త. అలా.. వెంకీ, అంజలా కాంబినేషన్ కి మణిశర్మ ఓ కామన్ ఫ్యాక్టర్ గా నిలిచారు. అటు ప్రేమించుకుందాం..రా!, ఇటు దేవీపుత్రుడు.. ఇలా రెండు కూడా మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పాటలన్నీ అప్పట్లో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
![]() |
![]() |