![]() |
![]() |

హీరోయిన్ గా శ్రీలీల పెళ్లి సందడి చిత్రంతో పరిచయమైంది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కోదండవీటి సహస్రాగా ఆమె నటన అందరినీ మెప్పించింది. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో పరిచయమైన హీరోయిన్స్ అందరూ టాప్ హీరోయిన్స్ అయ్యారు. కాగా ఈ పెళ్లి సందడి చిత్రానికి రాఘవేంద్రరావు పర్యవేక్షణ చేయడం విశేషం. ఈ చిత్రంతో ఒక మంచి హిట్‌ను సాధించిన శ్రీలీలా ఆ వెంటనే రవితేజ తో ధమాకా చిత్రంలో నటించింది. రోషన్ వంటి యంగ్ హీరో సరసన నటించిన ఆమె సీనియర్ హీరోగా కనిపించే రవితేజ తో నటించడం ఏమిటని కామెంట్లు వచ్చాయి.
కానీ ఈ కామెంట్లకి అతీతంగా ధమాకా చిత్రం తెలుగు నాట అదిరిపోయే కలెక్షను సాధించింది. 100 కోట్ల క్లబ్ లో చేరి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో శ్రీలీలా చూపించిన ఎనర్జీ మామూలుగా లేదు. ధమాకా వేడుకలో వచ్చే ఏడాదంతా శ్రీలీలాదే అని రవితేజ అన్న మాటలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. అది నిజమేనని నిరూపిస్తున్నాయి.
తాజాగా శ్రీలీల కేవలం రెండు చిత్రాల అనుభవంతో తన మూడవ చిత్రంలోనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హారిక అండ్ హాసిని బ్యానర్‌లో ఎస్ రాధాకృష్ణ అలియాస్ చిన్న బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు దర్శక గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కావడం విశేషం. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఇందులో ఒక హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డే ను తీసుకున్నారు. తాజాగా మరో హీరోయిన్‌గా శ్రీ లీలలు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ భాగస్వామి అయినా సూర్యదేవర నాగవంశీ స్వయంగా ప్రకటించారు. అయితే ఆయన ఇక్కడ ఒక వివరణ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అంటూ తేడాలు ఉండవని, ఇద్దరి హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుంది.
కాబట్టి ఇద్దరూ హీరోయిన్‌లే అని ఆయన తేల్చి చెప్పారు. కాగా గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో నటించిన సెకండ్ హీరోయిన్ లకు ఆ తర్వాత కెరీర్ డౌన్ ఫాల్ అయింది. కానీ శ్రీలీలా మాత్రం సెకండ్ హీరోయిన్ కాదు... ఆమె కూడా ఒక మెయిన్ హీరోయిన్ అని నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అందరూ కాస్త స్థిమిత పడ్డారు. మొత్తానికి శ్రీ లీల అందంతోపాటు, నటన, డాన్సులలో కూడా తనదైన ఎనర్జీని చూపిస్తూ ఉంటే వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో ఆమెకు అవకాశాలు ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
![]() |
![]() |