![]() |
![]() |

మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఇంతకుముందు 'అతడు', 'ఖలేజా' చిత్రాలు వచ్చాయి. 'అతడు' చిత్రం బాగానే విజయం సాధించిన 'ఖలేజా' చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కానీ ఈ రెండు చిత్రాలు ఇప్పటికీ టీవీలలో వస్తూ ఉంటే ప్రేక్షకులు వాటికి అతుక్కునిపోయి చూస్తారు. ఇక వీరు చాలా కాలం తర్వాత మూడో సినిమా కోసం జోడి కట్టారు. ఇది మహేష్ బాబు 28వ చిత్రం. యస్‌యస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా ఎస్. రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు నిర్మాణం చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆరు నెలల క్రితమే మొదలైంది. మొదటి షెడ్యూల్ పూర్తికాగానే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ లు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో మహేష్ బాబు కాస్త విషాదంలో ఉండడంతో సినిమా షూటింగ్ బాగా ఆలస్యమైంది. అదే సమయంలో హీరోయిన్‌గా అనుకున్న పూజా హెగ్డే ప్రమాదానికి గురై కాలికి దెబ్బ తగిలించుకుంది. ఇది కూడా షూటింగ్ వాయిదా పడటానికి ఒక కారణం అయ్యింది. కాగా సంక్రాంతికి ఈ సినిమా అప్డేట్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుందని పోస్టర్‌లోనే క్లారిటీ ఇచ్చారు. ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.
ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్‌ను నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవన్ నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు, ఆయన మాట్లాడుతూ "ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అనే ఆప్షన్స్ ఏమీ ఉండవు. కథాపరంగా ఇద్దరి హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఉంటుంది. ఆ రెండు పాత్రలకుగాను పూజా హెగ్డే, శ్రీలీలలను హీరోయిన్స్ గా ఎంపిక చేసుకున్నాం. వారిద్దరి పాత్రలు సినిమాలో కీలకంగా, సమానంగా, సమానమైన ప్రాధాన్యంతో నిండి ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 11న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నాము" అని చెప్పేశారు.
దీన్ని బట్టి త్రివిక్రమ్ ఈ మూవీ షూటింగ్ విషయంలో క్లారిటీగా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో విలన్ తో పాటు మరికొన్ని కీలక పాత్రల కోసం టబు వంటి బాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దించబోతున్నారు. విలన్ గా సంజయ్ దత్ నటించే అవకాశం ఉందని వినిపిస్తోంది. మరి ఈ విషయాలన్నింటిపై క్లారిటీ ఈనెల 18న వస్తుందేమోనని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు!
![]() |
![]() |