![]() |
![]() |

జానపద పాటలకు కేరాఫ్ అడ్రస్ గా సింగర్ మంగ్లీ అందరికీ పరిచయమే. ఆమె వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎంతమందిలో ఉన్నా ఆమె గొంతు ఇట్టే పోల్చుకోవచ్చు. అన్ని భాషల్లోనూ సాంగ్స్ పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా ఒక్కో అడుగూ వేస్తూ మూవీస్ లో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకుంది. ఒక పాన్ ఇండియా మూవీలో నటించబోతోంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
మంగ్లీ కి సింగర్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగుతో పాటు కన్నడలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడి అక్కడ కూడా తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. అక్కడ ప్రజల మనస్సులో కూడా మంగ్లీకి స్పెషల్ ప్లేస్ ఉంది. అలా ఆ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న "పాదరాయ" అనే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా కనిపించబోతోందని తెలుస్తోంది. 2013-2014 లో జరిగిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుందని సమాచారం.
ఇక ఈ మూవీని చక్రవర్తి చంద్రచూడ్ డైరెక్ట్ చేస్తున్నారు. టీవీ రంగంలోకి న్యూస్ యాంకర్ గా అడుగుపెట్టిన మంగ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఇటీవల టీటీడీలో ఒక కీలక పదవిని కూడా పొందింది. ఐతే తాను మూవీలో చేస్తుందా, లేదా అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. మంగ్లీ కూడా దీనిపై స్పందించలేదు.
![]() |
![]() |