![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో వివాహ నిశ్చితార్ధం డిసెంబర్ 8న మ్యాంగో గ్రూప్ అధినేత రామ్ వీరపనేనితో జరిగిన విషయం తెలిసిందే. తన పిల్లలు, తల్లిదండ్రుల సపోర్ట్‌తో రామ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆమె వెల్లడించారు. అయితే పెళ్లి తేదీ మాత్రం బయటకు రాలేదు. ఇంతకు ముందు హైదరాబాద్‌లో కొద్ది మంది సన్నిహిత మిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో డిసెంబర్ 27న వారి వివాహం జరగనున్నట్లు ప్రచారంలోకి వచ్చింది.
అయితే లేటెస్ట్గా పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదనీ, వచ్చే ఏడాది ఫిబ్రవరికి వారి పెళ్లి వాయిదా పడిందనీ తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లే పెళ్లి తేదీ ఫిబ్రవరికి మారిందని ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ చీరల షోరూమ్‌కు వచ్చిన ఆమె తన పెళ్లి గురించి ప్రస్తావిస్తే.. సమాధానం చెప్పడానికి ఇష్టపడకపోవడం గమనార్హం.
చానల్ రిపోర్టర్ "మీ పెళ్లి కుదిరింది కదా.. పెళ్లి ఇక్కడ చేసుకుంటున్నారా.. ఇంకెక్కడైనా ప్లాన్ చేస్తున్నారా?" అనడిగితే.. సునీత నవ్వుతూనే పిడికిలి బిగించి ఆ రిపోర్టర్‌ను "పంచ్ ఆన్ యు (నిన్ను కొట్టేస్తాను)" అంటూ గాల్లో పంచ్ విసిరారు. అయినా రిపోర్టర్ వదిలిపెట్టకుండా, "ఇంతకీ మీ పెళ్లెప్పుడు?" అని ప్రశ్నించారు. దానికి "ష్.." అంటూ నోటిపై చూపుడు వేలు పెట్టేసుకున్నారు సునీత. పబ్లిగ్గా తన పర్సనల్ విషయాలు మాట్లాడ్డానికి ఆమె ఇష్టపడరు కాబట్టే, పెళ్లి విషయం అడిగితే అలా దాటవేశారని మనం అర్థం చేసుకోవచ్చు.
![]() |
![]() |