![]() |
![]() |

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత అధికారిక బయోపిక్‌గా 'తలైవి' రూపొందుతోంది. టైటిల్ రోల్‌ను బాలీవుడ్ తార కంగనా రనౌత్ పోషిస్తున్నారు. కాగా జయలలిత జీవితంలో అతి ప్రధాన వ్యక్తి.. మరో మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎంజీ రామచంద్రన్ పాత్రను అరవింద్ స్వామి చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం.. ఆయన బార్య జానకీదేవి క్యారెక్టర్‌ను మధుబాల పోషిస్తుండటం.
మణిరత్నం క్లాసిక్ 'రోజా'లో అరవింద్ స్వామి, మధుబాల జంటగా నటించిన విషయం తెలిసిందే. 1992లో వచ్చిన ఆ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచమైంది ఆ సినిమాతోటే. మ్యూజికల్‌గా ఆ సినిమా సాధించిన అమోఘ విజయంతో రెహమాన్ ఓవర్‌నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు.
'రోజా' మూవీ తర్వాత అరవింద్ స్వామి, మధుబాల మరే సినిమాలోనూ కలిసి నటించలేదు. కానీ ఇన్నాళ్లకు.. 28 సంవత్సరాల తర్వాత వారు 'తలైవి'లో.. అదీ భార్యాభర్తలుగా నటిస్తుండటం ఓ విశేషంగా చెప్పుకోవాలి. మధుబాల అసలు పేరు మధూ షా. సౌత్‌లో నటించేటప్పుడు ఆమె స్క్రీన్ నేమ్ మధుబాలగా మారింది. ఇప్పుడు తిరిగి మధూ పేరుతో ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఎంజీఆర్ మూడో భార్య జానకీదేవి. 1963లో వారి వివాహమైంది. ఎంజీఆర్ ఆకస్మిక మృతితో తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిన ఆమె 24 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. 1996 మేలో జానకి కన్నుమూశారు.
ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న 'తలైవి'కి వి. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్‌ను సమకూర్చగా, విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![]() |
![]() |