![]() |
![]() |

బుల్లితెర నుంచి చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిల్వర్ స్క్రీన్ మీదకు వస్తున్నారు. జబర్దస్త్ నుంచి చాలా మంది కమెడియన్స్ సినిమాల్లో నటిస్తూ ఉన్నారు కూడా. ఇకపోతే బుల్లితెర మీద నవ్యస్వామి ఫ్రెండ్ ఎవరు అంటే చాలు వెంటనే రవి కృష్ణ అని యిట్టె చెప్పేస్తారు ఎవరైనా సరే. అలాంటి రవికృష్ణ ఇప్పుడు బుల్లితెరకి కాస్త బ్రేక్ ఇచ్చి సిల్వర్ స్క్రీన్ వైపు చూపు తిప్పాడు. "విరూపాక్ష" మూవీలో భైరవ్ కుమార్ గా ఒళ్ళు గగుర్పొడిచే సీన్ లో నటించి మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాడు. ఈ మూవీ థియేటర్స్ లోకి ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అలా హిట్ కొట్టేసింది.
"అసలు ఈ రోల్ కి మిమ్మల్ని తీసుకుందామనుకుంటున్నాం, కానీ డైలమాలో ఉన్నాం తీసుకోవాలా వద్దా అని ఎప్పుడైనా డైరెక్టర్స్ మీతో ఏమన్నా అన్నారా" అని అడిగేసరికి "ఇదైతే తెలీదు కానీ...ఈ రోల్ వేరే వాళ్ళైతే చేయాలి అనే విషయం తెలుసు. కంచరపాలెం మూవీలో చేసిన కార్తిక్ రత్నం చేయాల్సి ఉంది. డేట్స్ ఏవో ప్రాబ్లమ్ వచ్చింది అనుకుంటా కారణం తెలీదు కానీ నాకు రాసిపెట్టి ఉంది. అప్పుడు ఆడిషన్ కి పిలిచారు. ఇలా ఒక రోల్ ఉంది సెట్ అవుతారో లేదో స్క్రీన్ టెస్ట్ చేద్దాం అన్నారు ఫైనల్ గా వాళ్ళు అనుకున్న క్యారెక్టర్ కి సెట్ అవుతారు అని చెప్పారు. లుక్ టెస్ట్ బుల్లితెరకు వేరేలా..సిల్వర్ స్క్రీన్ మీద వేరేలా ఉంటుంది. మూవీకి చేసేటప్పుడు వాళ్ళు ఒక లుక్ అనుకుంటారు కదా దానికి కచ్చితంగా సెట్ అవ్వాలి.
మొగలి రేకులు సీరియల్ తర్వాత ఆడిషన్ ఇచ్చే పరిస్థితి రాలేదు కానీ ఇప్పుడు మాత్రం నేను ఆడిషన్ ఇచ్చేటప్పుడు చాలా ఎక్సయిట్ గా ఫీలయ్యాను. విరూపాక్ష హిట్ అయ్యాక మూడు సినిమాలకు సైన్ చేసాను. మంచి బ్యానర్స్, పెద్ద హీరోస్ తో చేస్తున్నా. పవన్కళ్యాణ్ పక్కన అవకాశం వస్తే అంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఏమీ లేదు" అని చెప్పాడు.
![]() |
![]() |