![]() |
![]() |

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అష్షు రెడ్డి బుల్లితెర మీద సందడి చేస్తూనే సినిమా ఛాన్సెస్ ని అందిపుచ్చుకుంటోంది. ఎట్టకేలకు సిల్వర్ స్క్రీన్ వరకూ రీచ్ ఐపోయింది. 'ఏ మాస్టర్ పీస్' అనే మూవీలో అష్షు కనిపించబోతోంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అనేది 12 వ తేదీన రిలీజ్ కాబోతోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ ని అటు అరవింద్ కృష్ణ, ఇటు అష్షు ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. 'ఏ మాస్టర్ పీస్' పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో ఆద్య అనే పాత్రలో అషూరెడ్డి కనిపించబోతోంది.
'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి మూవీస్ తో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుకు పూర్వాజ్. కమర్షియల్ గా రెండు చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇక ఈ డైరెక్టర్ తాజాగా 'ఏ మాస్టర్ పీస్' తో ఆడియన్స్ ముందుకు త్వరలో రాబోతున్నారు.
తొలి సినిమానే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుండడంతో అషు రెడ్డికి ఈ సినిమా మంచి సక్సెస్ ని అందిస్తోంది అంటున్నారు ఆమె ఫాన్స్. గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రను పోషిస్తోంది అష్షు. హీరోయిన్‌గా మంచి కమర్షియల్ బ్రేక్ కోసం ఎన్నాళ్లగానో వెయిట్ చేస్తున్న అషూరెడ్డికి ఈ మూవీ ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. అష్షు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అప్ డేట్స్ ని షేర్ చేసుకుంటూ అప్పుడప్పుడు గ్లామర్ షోస్ తో ఫాన్స్ కి మంచి విందు చేస్తూ ఉంటుంది.
![]() |
![]() |