![]() |
![]() |

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా పి.మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రధన్ సంగీత దర్శకుడు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఓ స్టార్ హీరో పాట పాడబోతున్నట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటుడిగానే కాకుండా గాయకుడిగానూ అలరిస్తుంటారు. ఇప్పటికే ఆయన పలు సినిమాల్లో పాటలు పాడి మెప్పించారు. ఇక ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'లో సైతం ఆయన పాట పడుతున్నట్లు సమాచారం. రధన్ స్వరపరిచిన పాటను తమిళ్ తో పాటు తెలుగులోనూ ధనుష్ ఆలపించనున్నారని వినికిడి. మరి ధనుష్ పాట ఈ సినిమాకి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |