![]() |
![]() |

మూవీ: సంభవం అధ్యాయం ఒన్ను
నటీనటులు: అస్గర్ అలీ, నీతూ క్రిష్ణ, సిద్దార్థ్ భరతన్, కనకం, వినీత్ కుమార్
ఎడిటింగ్: అర్జున్ ప్రకాశ్
మ్యూజిక్: గాడ్విన్ థామస్
సినిమాటోగ్రఫీ: నవీన్ నజోస్
దర్శకత్వం: జీతూ సతీషన్
ఓటీటీ : జియో హాట్ స్టార్
కథ:
కర్ణాటక - కేరళ సరిహద్దు ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్ కి సీపీఓ ఆనంద్ (అస్గర్ అలీ)కి బదిలీ అవుతుంది. మరో నెలలో డెలివరీ కానున్న తన భార్య 'నీతూ'ను వదిలి అతను అయిష్టంగానే బయల్దేరతాడు. విధుల్లో చేరడానికి అతను పోలీస్ స్టేషన్ కి వెళుతుండగా, వేరే రాష్ట్రానికి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ ను జీపు ఢీ కొడుతుంది. అతణ్ణి హాస్పిటల్లో చేర్పించిన తరువాతనే అతని పేరు జాన్ పీటర్ అనే విషయం ఆనంద్ కి తెలుస్తుంది. జాన్ పీటర్ దగ్గర లభించిన 'వాకీ టాకీ'ని తన దగ్గరే ఉంచుతాడు ఆనంద్. కొత్తగా డ్యూటీలో చేరిన ఆనంద్ కి పోలీస్ ఆఫీసర్ 'అశోకన్' తో .. మరో ఆఫీసర్ 'రెజీ'తో పరిచయం ఏర్పడుతుంది. ముగ్గురూ కలిసున్న సమయంలో జాన్ పీటర్ వాకీ టాకీ మోగుతుంది. అడవిలో తను ఆపదలో ఉన్నానని, తనని కాపాడమని పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ రిక్వెస్ట్ చేస్తాడు. అతను చెప్తున్న ఆనవాళ్ల ఆధారంగా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ముందుకు వెళ్తారు. అలా వాళ్లు మానవ దేహం .. కాకి తల కలిగిన ఒక విగ్రహం దగ్గరికి చేరుకుంటారు. ఆ తర్వాత వారికి ఏం జరిగింది? అసలు ఆ ఫోన్ లో మట్లాడిన వ్యక్తి ఎవరు? ఆ కాకి తల కలిగిన విగ్రహం అక్కడ ఎందుకు ఉంది? ఆనంద్, అశోకన్, రెజీల లైఫ్ లో జరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ:
కథ, స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ, బిజిఎమ్, స్ట్రాంగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అన్నీ పర్ ఫెక్ట్ గా ఉన్న ఈ సినిమా చివరి వరకు ఎంగేజింగ్ గా సాగుతుంది. ఒకసారి చూడటం మొదలెడితే చివరి వరకు చూసేలా మలిచారు మేకర్స్. సినిమా మొత్తం రెండు గంటల ఏడు నిమిషాలు..ఇందులో మొదటి నాలుగు నిమిషాలు టైటిల్స్, చివరి నాలుగు నిమిషాలు ఎండ్ కార్డ్స్ తీసేస్తే రెండు గంటల్లోపే సినిమా ఉంటుంది.
సినిమా మొదలవ్వడం ఒక హార్రర్ ఫీల్ ని కలిగించినా .. వెళ్ళే కొద్దీ సస్పెన్స్ ని అందిస్తుంది. ఇక ఫస్టాఫ్ పూర్తయ్యేసరికి కథ అర్థమైపోతుంది. అయితే అక్కడి నుండి ఎలా వాళ్ళు సర్వైవ్ అయ్యారనే పాయింట్ ని దర్శకుడు జీతు సతీషన్ సరిగ్గా మలిచారు. ఇందులో నెగెటివ్ అంటూ ఏం లేవు. అయితే సినిమా మొదలైనప్పటి నుండి చివరి వరకు వేరే ఏ ఇతర పనులు చేయకుండా చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. కొంచెం స్కిప్ చేసి చూసినా ఆ థ్రిల్ మిస్ అవుతారు.
ఇందులో వచ్చే ట్విస్ట్ లు ఎవరి ఊహకి ఉందవు.. ఒకవైపు మనుషులు ఎవరైనా చేస్తున్నారా అనే భావన కలుగుతుంది.. మరోవైపు దెయ్యాలు ఏమైనా ఉన్నాయా అనే భావన కలుగుతుంది. మరోవైపు దైవ శక్తి అంటూ అన్నీ మిక్స్ చేసి చూపించడంతో ఆడియన్స్ కాస్త అయోమయంగా ఉంటుంది. అయితే వెళ్ళే కొలదీ వచ్చే ట్విస్ట్ లతో ఆద్యాంతం ఎంగేజింగ్ గా ఉంటుంది. ఫస్టాప్ తర్వాత క్యాట్ అండ్ మౌస్ చేజ్ లా రేసీగా సాగుతుంది కథ. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తో ఆడియన్ థ్రిల్ అవ్వాల్సిందే. అడల్ట్ సీన్లు లేవు.. అసభ్య పదజాలం వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంది. నవీన్ నజోస్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. గాడ్విన్ థామస్ అందించిన బిజిఎమ్ బాగుంది. అర్జున్ ప్రకాశ్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు: ఆనంద్ గా అస్గర్ అలీ, అశోకన్, రెజీ, తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : వర్త్ వాచింగ్ మూవీ.
రేటింగ్ : 3/5
![]() |
![]() |