![]() |
![]() |

-విభిన్నషేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తో దూసుకుపోతున్న సంయుక్త
-గోల్డెన్ లెగ్ అనే పేరు
-రీసెంట్ గా ఎమోషనల్ పోస్ట్
కొంత మంది తారలు సిల్వర్ స్క్రీన్ పైకి రావడం, తమ హవాని చాలా బలంగా చాటుతూ ఉండటం చకచకా జరిగిపోతుంటాయి. అలాంటి వాళ్ళల్లో సంయుక్త మీనన్(Samyuktha Menon)ఒకటి. గ్లామర్ రోల్స్ అయినా, పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ రోల్స్ అయినా తన ఫిజిక్ ని ఏ తీరుగా కావాలంటే ఆ తీరుగా మార్చుకోగలదు. భీమ్లా నాయక్, బింబి సార, విరూపాక్ష, సార్, అఖండ 2 , నారీనారీ నడుమ మురారి, లోని క్యారెక్టర్స్ నే ఉదాహరణ. గోల్డెన్ లెగ్ అనే టాగ్ లైన్ ని కూడా పొందిన సంయుక్త రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేసారు. మరి ఆ పోస్ట్ లో ఏముందో చూద్దాం.
సంయుక్త మీనన్ అప్ కమింగ్ మూవీస్ లో 'బ్లాక్ గోల్డ్'(Block Gold)ఒకటి. ఫస్ట్ టైం లేడీ ఓరియెంటెడ్ మూవీలో చేస్తుండగా చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన విషయాన్నే ఇన్ స్టాగ్రామ్ లోప్రస్తావిస్తూ ''బ్లాక్ గోల్డ్’కొత్త షెడ్యూల్ మంచిర్యాల(Manchiryala)లో జరిగింది. 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండలు మండిపోయాయి. ఈ విషయంలో టీమ్ అంతా ఇబ్బంది పడ్డాం. మంచిర్యాల మమ్మల్ని ఎన్ని విధాలుగా పరీక్షించినా మా టీమ్ ధృడంగా నిలబడింది. అలసట, వేడిని తట్టుకుని అంకితభావంతో పనిచేశారు. వాళ్ళ పట్టుదలకి గర్విస్తున్నాను.
aslo read: Trisha: త్రిషపై తమిళ దర్శకుడి కామెంట్స్.. షూట్ కంప్లీట్ అయినా సెట్ కి ఎందుకు వెళ్ళింది
వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ బారిన పడటం లాంటివి జరిగినా, నా పర్సనల్ టీమ్ తీసుకున్న జాగ్రత్తల వల్లే నేను నిలబడగలిగాను. డైరెక్టర్ యోగి గైడెన్స్, నమ్మకం ఎంతో బలాన్ని ఇచ్చాయి హైదరాబాద్ నుంచి సపోర్ట్ అందించిన నిహారికకి, సెట్స్ లో అన్నీ తానై చూసుకున్న పార్ధుకి స్పెషల్ థాంక్స్ అని తెలిపింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా కోసం యూనిట్ ఎంత కష్టపడుతుందో అందరకి తెలిసినట్లయింది. యాక్షన్ డ్రామాగా బ్లాక్ గోల్డ్ తెరకెక్కుతుండగా ఈ సమ్మర్ కె పాన్ ఇండియా వ్యాప్తంగా ల్యాండ్ కానుంది. సంయుక్త ఖాతాలో నిఖిల్ ప్రెస్టేజియస్ట్ పాన్ ఇండియా మూవీ స్వయంభు కూడా ఉండగా దశాబ్దాల క్రితం నాటి యుద్ధ వీరురాలుగా కనిపించనుంది. దీన్ని బట్టి పైన మనం చెప్పుకున్న సంయుక్త యాక్టింగ్ కెపాసిటీని అర్ధం చేసుకోవచ్చు.

![]() |
![]() |