![]() |
![]() |

-సౌత్ లో త్రిషకి ఉన్న స్టార్ డమ్ తెలిసిందే
-విశ్వంభరతో త్వరలో రాక
-మే 14 న సూర్యతో కలిసి కరుప్పు తో కనువిందు
-తెలుగు టైటిల్ వీరభద్రుడు
-అలాంటి టైంలో త్రిషపై ప్రముఖ దర్శకుడి వ్యాఖ్యలు వైరల్
త్రిష(Trisha).. ఈ పేరు వింటే చాలు లెక్కలేనన్ని సినిమాల్లో ఆమె పోషించిన క్యారెక్టర్స్ మనతో ఏవో ఊసులాడుతూ ఉంటాయి. అంతలా తన పెర్ఫార్మ్ తో మనల్ని తన వశం చేసుకోగలదు. సెకండ్ ఇన్నింగ్స్ లో విజయ్(Vijay)తో చేసిన లియో, కమల్(Kamal)తో చేసిన థగ్ లైఫ్ తో తన జైత్రయాత్రని కొనసాగిస్తోంది. చిరంజీవి(Chianjeevi)విశ్వంభరలో కూడా త్రిషనే. ప్రెజెంట్ తన అప్ కమింగ్ మూవీ 'కరుప్పు'(Karuppu). సూర్య(Suriya)హీరో కాగా తెలుగులో వీరభద్రుడు(Veerabhadrudu)టైటిల్ తో వస్తుంది. ఆ చిత్ర దర్శకుడు త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు ఆమెకి సినిమా, నటన పట్ల ఉన్న కమిట్ మెంట్ కి ఉదారణగా చెప్పుకోవచ్చు. ఆ వ్యాఖ్యలు చూద్దాం.
వీరభద్రుడుకి దర్శకుడు ఆర్ జె బాలాజీ(RJ Balaji). రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు గతంలో త్రిషతో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ సాధ్యపడలేదు. కానీ కరుప్పు కోసం సంప్రదించి స్క్రిప్ట్ ని వినిపించాను. దాంతో హీరోయిన్ గా చెయ్యడానికి ఒప్పుకుంది. పైగా తన క్యారక్టర్ కి సంబంధించిన షూట్ కంప్లీట్ అయినా మాతో కలిసి సెట్ కి వచ్చే వారని చెప్పాడు. ఇప్పుడు ఈ ఒక్క మాట త్రిష అభిమానులతో పాటు నెటిజన్స్ ని విశేషంగా ఆకర్షిస్తుంది. అంత కమిట్ మెంట్ ఉండటం వల్లనే త్రిష ఇన్ని సంవత్సరాల నుంచి తన హవా కొనసాగిస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు.
Also read: Ranbir Kapoor: 'రణబీర్'కి విలువైన బహుమతిని కట్టబెట్టిన రాముడు.. ఏకైక భారతీయనటుడిగా రికార్డు
వీరభద్రుడు మే 14 న వరల్డ్ వైడ్ గా రిలీజవ్వడానికి కావలసిన అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుంటుంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే ఈ సారి సూర్యకి పరాజయాలు కాన్ఫిడెన్స్ గానే గుడ్ బై చెప్పేలా ఉన్నాయి. ఆర్ జె బాలాజీ సినీ జాతకం ప్రెజెంట్ హిట్ మోడ్ లోనే ఉంది. అయితే ఈ చిత్రానికి ఉన్న స్పెషల్ ఏంటంటే 22 ఏళ్ళ తర్వాత సూర్య, త్రిష జంటగా చేస్తు సిల్వర్ స్క్రీన్ కి నూతన కాంతులని తీసుకురానున్నారు. ఈ ఇద్దరు 2005లో 'ఆరు' మూవీతో కనిపించారు. సదరు మూవీలోని 'చూడద్దే.. నను చూడద్దే.. సుర కత్తిలాగా నను చూడద్దే సాంగ్ నేటికీ చాలా మంది ఫేవరేట్ సాంగ్ హోదాలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది.

![]() |
![]() |