English | Telugu
వంద కోట్ల బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ మూవీ!
Updated : Jun 1, 2023
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న విలక్షణ నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషించి ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆయన వారసులు విష్ణు, మనోజ్, లక్ష్మి కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే కొంతకాలంగా సినిమాలు తగ్గించి, తన యూనివర్సిటీ పనుల్లో బిజీగా ఉంటున్న మోహన్ బాబు.. త్వరలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తీయబోతున్నారు.
ఈరోజు(గురువారం) మోహన్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే నెంబర్ వన్ యూనివర్సిటీగా మలిచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రూ.100 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నామని, దాని వివరాలు ఇప్పుడే చెప్పలేనని, త్వరలో విష్ణు ప్రకటిస్తాడని అన్నారు. ఈ సినిమా మోహన్ బాబు యూనివర్సిటీ నేపథ్యంలో ఉండనుందని సమాచారం.
కాగా గతంలో విష్ణు 'భక్త కన్నప్ప' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. మరి ఇప్పుడు ఆ సినిమా స్థానంలోనే ఈ కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించనున్నారేమో తెలియాల్సి ఉంది.