English | Telugu
అభిలాష నా ఫస్ట్ మూవీ...కానీ ఐరావతం ముందు రిలీజ్ అయ్యింది
Updated : Jun 1, 2023
అమరదీప్ నటించిన "అభిలాష" మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి చిన్న చిన్న ప్రొమోషన్స్ చేస్తున్నాడు. ఇక తన వైఫ్ తేజస్విని గౌడ కూడా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేసింది. జానకి కలగనలేదు సెట్ కి వెళ్లి అక్కడ షూటింగ్ లొకేషన్ లో ఉన్న అమరదీప్ తో చిన్న చిట్ చాట్ చేసింది. ఇంతకు సినిమా చేసావ్ కదా దాని గురించి నీ మాటల్లో చెప్పు అని అడిగేసరికి "నా సినిమా గురించి నేను చెప్పుకోవడం అస్సలు బాగోదు..నువ్వు ట్రైలర్ చూసావ్ కదా.. నువ్వే చెప్పు" అని అమరదీప్ రివర్స్ లో అడిగేసరికి మూవీలో ఫైట్స్ బాగున్నాయి అని చెప్పింది..
" తేజు.. "సిరిసిరి మువ్వలు" సీరియల్ టైంలో నేను ఫస్ట్ చేసిన మూవీ "అభిలాష" తర్వాత "ఐరావతం" మూవీ చేసాను..కానీ ఫస్ట్ మాత్రం ఐరావతం రిలీజ్ అయ్యింది.." అని చెప్పాడు అమరదీప్. "సరే ఫస్ట్ మూవీ చేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏమిటి" అని తేజు అడిగేసరికి "ఫస్ట్ మూవీలోనే ఇంత భారీ ఫైట్స్ పెట్టారు..వీడి ఓవర్ యాక్షన్ ఏమిట్రా అని ఆడియన్స్ అనుకుంటారేమో అనుకున్నా..కానీ అంతకుముందే ఒక ఐరావతం మూవీ రిలీజ్ ఐపోయింది కాబట్టి కొంచెం టెన్షన్ తగ్గింది. నా ఐరావతం మూవీలో చాక్లెట్ బాయ్ లా ఉంటాను క్యూట్ లవ్ స్టోరీ అది. ఇక అభిలాష మూవీ ఏంటంటే మాస్..." అని చెప్పాడు. అమరదీప్ బుల్లితెర మీద అందరికీ తెలిసిన నటుడు. తన సహా నటి తేజస్వినిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక అభిలాష మూవీని చూసి తమను ఎంకరేజ్ చేయమని అలాగే త్వరలోనే ఓటిటి ప్లాటుఫారం పైన కూడా రిలీజ్ కాబోతోంది అని చెప్పారు . అమర్ దీప్ సీరియల్స్ తో పాటు షోస్ లో కనిపిస్తూ ఉంటాడు. ఇక ఈ జోడి త్వరలో రాబోతున్న "నీతోనే డాన్స్" షో ప్రోమోలో కూడా కనిపించింది.