Home  »  News  »  Urvashi rautela: ఆ బడా హీరోయిన్స్ కాళ్ళు పట్టుకున్న ఊర్వశి రౌతేలా!.. ఈ పిక్ అందుకు సాక్ష్యం

Updated : May 28, 2026


మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi),గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)తో అదిరిపోయే స్టెప్స్ వేసి తన కంటు ఒక బ్రాండ్ సృష్టించుకున్న పాన్ ఇండియా భామ 'ఊర్వశి రౌతేలా'(urvashi rautela). రీసెంట్ గా జరిగిన 'కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 వేడుకల్లో వరుసగా 5వ సారి తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో సన్సేషన్ సృష్టించింది. రీసెంట్ గా  ఊర్వశికి  సంబంధించిన ఒక షాకింగ్ ఏఐ చిత్రం ఇంటర్నెట్‌ని  కుదిపేస్తోంది. ఈ ఫోటోలో ఊర్వశి రౌతేలా ఇతర సీనియర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సింహాసనాల ముందు మోకాళ్లపై కూర్చుని, వారి కాళ్లు పట్టుకున్నట్లుగా చూపించడం తీవ్ర సంచలనంగా మారింది.

ఈ వివాదాస్పద ఏఐ చిత్రం బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్ల గ్లోబల్ స్టార్‌డమ్, వారి స్థానాలని  ఒక క్రమపద్ధతిలో ర్యాంకింగ్ ఇస్తూ రూపొందించబడింది.  అగ్ర నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఒక పెద్ద సింహాసనంపై సుప్రీం స్థానంలో కూర్చుని ఉండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా  దాని పక్కనే ఉన్న మరొక చిన్న సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు చూపించారు. ఇక వారి ఇరువైపులా స్టార్ హీరోయిన్లు మాధురీ దీక్షిత్, దీపికా పదుకొణె నిలబడి ఉండగా.. కింద నేలపై మోకాళ్లపై కూర్చుని వారి పాదాలని  తాకుతున్నట్లుగా ఊర్వశి రౌతేలా, అలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్ ల చిత్రాలని  ఏఐ సాయంతో సృష్టించారు. గ్లోబల్ గుర్తింపులో ఊర్వశి రౌతేలా తక్కువ స్థానంలో ఉందనే అర్థం వచ్చేలా ఈ మార్ఫింగ్ చిత్రాన్ని రూపొందించడం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు అంతర్జాతీయ వేదికపై ఇంతటి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో, తనని  తోటి నటీమణుల కాళ్ల వద్ద మోకరిల్లినట్లు చూపించడంపై ఊర్వశి తీవ్రంగా స్పందించింది. 

తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో  వైరల్ ఏఐ పిక్‌ని షేర్ చేస్తూ  సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పెట్టింది. "ఇలాంటి విషపూరితమైన సంస్కృతిని ఇకనైనా ఆపండి. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క హీరోయిన్‌కి  తనదైన స్వంత ప్రయాణం, కఠిన శ్రమ, మరియు విధి ఉంటాయి. మహిళల మధ్య లేనిపోని విభేదాలు సృష్టించడం, ఫ్యాన్ వార్స్‌ని  ప్రోత్సహించడం వల్ల సమాజంలో కేవలం ప్రతికూలత మాత్రమే పెరుగుతుంది. సినిమా రంగంలో ఉన్న మహిళలందరినీ సమానంగా గౌరవించాలి. ఒకరి ప్రతిభని  మరొకరితో పోల్చకుండా ప్రతి ఒక్కరి ఎదుగుదలని , కష్టాన్ని, వారిలోని దయాగుణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఊర్వశి పిలుపునిచ్చింది.  రీసెంట్‌గా రణదీప్ హుడాతో కలిసి 'ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2' అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఊర్వశి, ఈ ఏఐ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

Also read: Pawan Kalyan: భేటీకి మమ్మల్ని పిలవలేదంటు యువ నిర్మాత సంచలనం.. పవన్ ఏమంటారో


సెలబ్రిటీల మధ్య ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పట్నుంచో ఉన్నాయి. ఎవరి అభిమాన నటుడు లేదా నటి వారికే గొప్ప. అయితే, ఈ మధ్యకాలంలో  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ వార్స్ సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. సెలబ్రిటీల ముఖాలని  మార్ఫింగ్ చేస్తూ, విచిత్రమైన ఊహాజనిత చిత్రాలని  సృష్టిస్తూ వైరల్ చేయడం నెటిజన్లకి ఒక అలవాటుగా మారింది.

 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.