Home  »  News  »  ట్రోలర్స్‌కు ఛాన్స్ ఇవ్వని చరణ్.. ఢిల్లీ ఈవెంట్‌కి  కొత్త ప్లాన్‌తో వెళ్లిన గ్లోబ‌ల్‌స్టార్‌!

Updated : May 28, 2026

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా చరణ్ దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేస్తూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో చరణ్ తనదైన శైలిలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.

అయితే ఈసారి ఢిల్లీ వేదికపై రామ్‌చరణ్ ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారు. గతంలో భోపాల్‌ లో జరిగిన ప్రచార వేడుకల్లో చరణ్ హిందీలో మాట్లాడటానికి ప్రయత్నించి కొద్దిగా తడబడ్డారు. తనకు హిందీ అంతగా రాదంటూనే ప్రసంగించిన క్రమంలో భోపాల్ బదులు బిహార్ అనడం, క్రికెటర్ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొనడం వంటి చిన్న పొరపాట్లు జరిగాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు కొంతవరకు ట్రోల్స్ చేశారు.

ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ఈవెంట్‌లో హిందీ జోలికి వెళ్లకుండా పూర్తిగా ఇంగ్లీష్‌లోనే అనర్గళంగా మాట్లాడారు. అంతేకాదు, ప్రసంగం మధ్యలో ఒకరి పేరు గుర్తుకురాకపోతే వెంటనే తన టీమ్‌ను అడిగి కన్ఫర్మ్ చేసుకుని మరీ మైక్ ముందుకు వచ్చారు. దీంతో ట్రోలర్స్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చరణ్ ఈ ఈవెంట్‌ను సూపర్ సక్సెస్ చేశారు.

ఈ వేడుకలో సినిమా గురించి చరణ్ మాట్లాడుతూ.. 'పెద్ది' సినిమా ముఖ్యంగా పిల్లలకు ఎంతగానో నచ్చుతుందని, తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి థియేటర్లకు వచ్చి చూడదగ్గ అద్భుతమైన చిత్రమని భరోసా ఇచ్చారు. ఈ సినిమా చూసిన ఏ ఒక్క పేరెంట్ కూడా నిరాశ చెందరని నమ్మకంగా చెప్పారు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

మరోవైపు 'పెద్ది' చిత్రయూనిట్‌కు మద్రాస్ హైకోర్టు నుండి ఒక బిగ్ రిలీఫ్ లభించింది. సినిమా విడుదలకు ముందే లీకులు, పైరసీ ఇబ్బందులను అరికట్టేందుకు కోర్టు యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం సినిమా క్లిప్స్ లీక్ చేసినా లేదా అనధికారికంగా స్ట్రీమింగ్ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే హక్కును మేకర్స్‌కు కల్పించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి లీగల్ ప్రొటెక్షన్ లభించడం పట్ల ట్రేడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చరణ్ ఢిల్లీ స్పీచ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. భోపాల్ ఇన్సిడెంట్ తర్వాత చరణ్ చాలా స్మార్ట్ గా వ్యవహరించారంటూ ఫ్యాన్స్ మరియు సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.