Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్..

Updated : May 28, 2026

1. 'పెద్ది' మూవీ దుబాయ్ సెన్సార్ టాక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాల నుంచి బ్లాక్‌బస్టర్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఫస్టాఫ్‌లో రామ్ చరణ్ - జగపతిబాబుల మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉండటంతో పాటు.. సెకండాఫ్‌లోని చివరి 45 నిమిషాలు, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.

2. నార్త్ లో ఎన్టీఆర్ 'డ్రాగన్' క్రేజ్
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ 'డ్రాగన్'. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్.. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ గ్లింప్స్ ఒక్క హిందీ వెర్షన్ లోనే ఏకంగా 40 మిలియన్ వ్యూస్ మైలురాయిని దాటి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. హిందీలో ఈ గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. నార్త్ ఇండియా బాక్సాఫీస్ ను డ్రాగన్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

3. 'విశ్వనాథ్ అండ్ సన్స్' రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'లక్కీ భాస్కర్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాటు, ఇటీవల 'కరుప్పు'తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూర్య నెక్స్ట్ మూవీ కావడంతో.. దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

4. ముంబైలో బాలయ్య విధ్వంసం!
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న 'NBK 111' మూవీ, ముంబై నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం బాలకృష్ణ ఈ వారంలోనే ముంబై వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే లాంగ్ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, భారీ యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌గా సందడి చేయనున్నట్లు సమాచారం.

5. 'పెద్ది' సినిమాకి హైకోర్టు యాంటీ పైరసీ ఉత్తర్వులు 
'పెద్ది' సినిమా ఇంటర్నెట్‌లో అనధికారికంగా అప్‌లోడ్ కాకుండా మరియు పైరసీకి గురికాకుండా అడ్డుకోవడానికి మద్రాస్ హైకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. యాంటీ-పైరసీ ఆదేశాలను ఇచ్చింది. దీని ద్వారా సినిమాను చట్టవిరుద్ధంగా కాపీ చేయడం, పైరసీ వెబ్‌సైట్లలో ప్రసారం చేయడం వంటి చర్యలపై కోర్టు నిషేధం విధించింది.

6. 'ఎల్లమ్మ'గా యంగ్ బ్యూటీ
'బలగం' ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న 'ఎల్లమ్మ' సినిమాలో హీరోయిన్‌గా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు నటించనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాలో హీరోయిన్ పాత్ర కోసం ప్రస్తుతం చిత్ర బృందం మమితతో సంప్రదింపులు జరుపుతోంది. గతంలో ఈ క్యారెక్టర్ కోసం సాయిపల్లవి, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించగా.. ఫైనల్‌గా ఈ కేరళ కుట్టికి ఛాన్స్ దక్కినట్లు ఫిలిం నగర్ టాక్.

7. 'బ్లాస్ట్ జోన్' మూవీ రివ్యూ
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించిన 'బ్లాస్ట్ జోన్' మూవీ నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా సింపుల్ స్టోరీతో సాగినప్పటికీ.. యాక్షన్ ప్రియులను అలరించేలా చక్కటి వినోదభరితమైన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచింది. నటీనటుల పర్ఫార్మెన్స్, సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్, రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫస్టాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగడం, సినిమాలోని చాలా సన్నివేశాలు ఊహకందేలా ఉండటం మైనస్ అయింది.

8. 'జైలర్ 2' సినిమాలో హృతిక్ రోషన్
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2'లో ఒక పవర్‌ఫుల్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యామియో పాత్ర కోసం మొదట షారుఖ్ ఖాన్ అనుకున్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సంప్రదించగా, ఆయన రాజకీయ కారణాల వల్ల నో చెప్పారు. కథను మలుపు తిప్పే ఈ కీలక పాత్ర కోసం ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో చర్చలు జరుపుతున్నారు.

9. డివైడ్ టాక్ తో 200 కోట్లు...
మలయాళ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ, కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసి సంచలనం సృష్టించింది. 'దృశ్యం' ఫ్రాంచైజీలోనే అత్యంత వేగంగా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలవడమే కాకుండా, మాలీవుడ్‌లో ఈ ఏడాది అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

10. ఆరు కోట్లు పెడితే.. 800 కోట్లు వచ్చాయి
హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్' (Obsession). కేవలం రూ.6.25 కోట్ల బడ్జెట్‌తో, 20 రోజుల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 830 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 2026లోనే అత్యంత భారీ ప్రాఫిట్స్ అందుకున్న హాలీవుడ్ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.