`ఎన్టీఆర్` సినిమాలో ఎన్టీఆర్ కనిపించడమేంటి అనుకుంటున్నారా? అవును మీరు చదివింది కరెక్టే . `ఎన్టీఆర్ మహానాయకుడు` లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ పాత్రలో బాలకృష్ణ మనవడు నారా దేవాన్ష్ నటించాడట. ఇప్పటికే ఈ సన్నివేశాలను చిత్రీకరణ పూర్తయింది. తాత ఎన్టీర్, మనవడు ఎన్టీఆర్ మధ్యలో జరిగిన కొన్ని సంభాషణలు, సన్నివేశాలు మహానాయకుడులో పొందుపరిచారట. ఈ న్యూస్ ప్రస్తుతం మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తోన్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తోన్న నారా దేవాన్ష్ లపై ఈ సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ సన్నివేశాలు నందమూరి అభిమానులను కనువిందు చేసేలా ఉంటాయట. త్వరలో ఈ చిత్ర ఆడియో వేడుకును ఘనంగా చేయనున్నారు. ఈ నెల 22న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.