![]() |
![]() |

తెలుగు సినిమా ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే గాని జయప్రకాశ్ రెడ్డి లాంటి నటుడు తెలుగు సినిమా ఒడిలో చేరి ఉండడనే మాట తెలుగు సినిమా లవర్స్ లో వినపడుతూ ఉంటుంది. తెలుగు సినిమాపై తన ఆధిపత్యాన్ని కూడా చెలాయించిన ఈ లెజండ్రీ నటనకి సంబంధించి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో, వస్తాయో వాటన్నిటిలో లబ్ధప్రతిష్టుడు.
గతంలో బాలకృష్ణ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మరో సారి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతు 'సమరసింహా రెడ్డి షూటింగ్ సమయంలో సెట్‌లో నేను అడుగుపెట్టగానే, కుర్చీలో కూర్చున్న బాలకృష్ణ గారు వెంటనే లేచి నిలబడి “గురువుగారు” అని పిలిచారు. అంత పెద్ద కుటుంబంలో పుట్టి, అంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎంత ధనవంతుడైనా కూడా ఎక్కడా అహంభావం ప్రదర్శించలేదు. ఓం నమశ్శివాయ అని ఐదు సార్లు పలకరించమని చెప్పే ఆయన తీరు బాలకృష్ణలోని నిరాడంబరత, బోళా మనస్తత్వానికి నిదర్శనం. చిన్నపిల్లవాడి మనస్తత్వం కలిగి ఉంటారు.
Also Read: వైరల్ కామెంట్స్: మాతృత్వపు ప్రయాణంపై సమంత స్పందన ఇదే
తన తండ్రి నటించిన సినిమాల్లోని క్యారెక్టర్స్ , సంభాషణలు అద్భుతంగా గుర్తుంచుకుని అవలీలగా చెప్పగల హ్యూమన్ కంప్యూటర్. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే తపన, నేర్చుకున్నది సరిగ్గా ఉందా లేదా అని తిరిగి అడిగి తెలుసుకోవడం వంటి లక్షణాలు బాలకృష్ణ గారికి ఉన్నాయని జయప్రకాశ్ రెడ్డి చెప్పుకొచ్చాడు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎవరు అనాధ, పేదోడు కాదు అనేది ఎంత నిజమో, జయప్రకాశ్ రెడ్డి గారు చనిపోలేదు అనేది అంతే నిజం.
[Jayaprakash Reddy, Balakrishna, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]
.webp)
![]() |
![]() |