Home  »  News  »  అందుకే కింగ్ అనేది.. హ్యాపీ బర్త్ డే నాగార్జున  

Updated : Aug 29, 2026

 


ప్రపంచ చలన చిత్ర చరిత్రలో హీరో క్యారక్టరయిజేషన్ కి సంబంధించి కింగ్ నాగార్జున చూపించిన వేరియేషన్స్ మరో హీరో చూపించలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి లవ్, ఎమోషనల్, మాఫియా, రొమాన్స్, కమర్షియల్, ఫ్యామిలీ, ఎంటర్ టైన్ మెంట్, భక్తి రస చిత్రాల్లో తనదైన హవా చాలా బలంగా చాటి చెప్పాడు. ప్రొడ్యూసర్ గా  కూడా తెలుగు సినిమా ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. మరి ఈ ట్రాక్ రికార్డు వరల్డ్ సినిమా హిస్టరీలో ఇంకొకరికి ఉండటం అసాధ్యం.     అందుకే అభిమానులు తెలుగు సినిమా కింగ్ గా పిలుచుకుంటారు. తెలుగు సినిమాని పాన్ ఇండియాకి మూడు దశాబ్దాల క్రితమే పరిచయం చేసిన ఈ మన్మధుడు 'గ్లామర్, ప్రయోగం, విజయం' అనే మూడు మహత్తరమైన పదాల పుట్టుకకి ఆద్యుడు కూడా 


ఆగస్టు 29, 1959న జన్మించిన నాగార్జున, 1986లో వచ్చిన 'విక్రమ్' సినిమాతో కథానాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదటి సినిమాతోనే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ప్లాప్స్ ఎదుర్కొని  'మజ్ను', 'ఆఖరి పోరాటం', 'జానకి రాముడు' వంటి వరుస హిట్లతో లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా టాలీవుడ్‌లో తన ముద్ర వేశారు.  తెలుగు సినిమా చరిత్రను 'శివ'కు ముందు, 'శివ'కు తర్వాత అని విభజించేంత గొప్ప సంచలనాన్ని 1989లో సృష్టించాడు.  సైకిల్ చైన్ పట్టుకున్న సీన్ తోనే ఎంటైర్  భారతీయ సినిమా ట్రెండ్‌ ని మార్చివేసాడు. అదే ఏడాది వచ్చిన మణిరత్నం 'గీతాంజలి' క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచి, జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. కమర్షియల్ మాస్ సినిమాలతో పాటు ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే నాగ్, 'హలో బ్రదర్', 'అల్లరి అల్లుడు', 'నిన్నే పెళ్లాడతా', 'మన్మథుడు' వంటి చిత్రాలతో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ని  విపరీతంగా అలరించారు.


Also Read: నారాలోకేష్ దగ్గరకి ఇరుముడి పంచాయితీ.. వందల థియేటర్స్ పెంపు 

 

కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా, భక్తిరస చిత్రాల్లో నటించి మెప్పించడం నాగార్జునకే చెల్లింది. 1997లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'అన్నమయ్య' చిత్రం నాగార్జున కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రానికి గాను ఆయనకు జాతీయ చలనచిత్ర ప్రత్యేక పురస్కారం (National Film Award - Special Mention) మరియు నంది ఉత్తమ నటుడి అవార్డు లభించాయి. ఆ తర్వాత 'శ్రీరామదాసు' (2006), 'షిర్డీ సాయి' (2012), 'ఓం నమో వేంకటేశాయ' (2017) వంటి భక్తిరస చిత్రాలతో భక్తుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.  నటుడిగానే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, నిర్మాతగా కూడా నాగార్జున ఎన్నో సంచలన విజయాలను అందించారు. 'సిసింద్రీ', 'నిన్నే పెళ్లాడతా', 'మాస్', 'మనం', 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి చిత్రాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టారు. ఇప్పటివరకు తన సినీ ప్రస్థానంలో 9 నంది పురస్కారాలు, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మరియు 2 జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకోవడం ఆయన నటనా పటిమకు నిదర్శనం. ఇప్పటి వరకు 99 చిత్రాల్లో హీరోగా మెప్పించిన నాగార్జున, ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 100వ సినిమా (King 100) సిద్ధం చేస్తూ టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. మరి నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అభిమానులని మరిన్ని సంవత్సరాల పాటు తన సినిమాకి రెండు రోజుల ముందు నుంచే బ్యానర్స్ కట్టి థియేటర్స్ లోనే స్టే చేసే భాగ్యాన్ని అందివ్వాలని కోరుకుందాం. 

 

 

 

[Nagarjuna, King100, Nag, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.