Home  »  News  »  DC కలెక్షన్ల సునామీ: 4 రోజుల్లోనే 50 కోట్లతో లోకేష్ కనగరాజ్  ఊచకోత.!

Updated : Aug 11, 2026

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారి చేసిన మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. విడుదలైన మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సాధారణంగా లోకేష్ కనగరాజ్‌ను మనం ఒక స్టార్ డైరెక్టర్‌గా చూశాం. కానీ ఈ సినిమాలో ఆయన ఒక పవర్ ఫుల్ మాస్ రోల్ అదరగొట్టడం, ఆయనకు తోడుగా వామికా గబ్బి గన్స్ పట్టుకుని స్క్రీన్ మీద చేసిన అరాచకం ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. ఈ 'DC' ప్రయాణం 50 కోట్లతో ఆగేలా లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

https://x.com/sunpictures/status/2087138361731666199

 

 

DC Movie Collections, Lokesh Kanagaraj, Wamiqa Gabbi

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.