Home  »  News  »  రాముడు vs కుంభకర్ణుడు: వారణాసి రామాయణ ఎపిసోడ్ లీక్.!

Updated : Aug 11, 2026

మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి'. ఈ సినిమాలోని రామాయణ ఎపిసోడ్‌ గురించి సంచలన నిజాలు బయటకొచ్చాయి. ఈ ప్రత్యేకమైన రామాయణ సీక్వెన్స్‌లో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో సీతాదేవి, రావణాసురుడు వంటి పాత్రలు ఉండవట. కేవలం శ్రీరాముడు, కుంభకర్ణుడు మధ్య జరిగే భయంకరమైన యుద్ధ సన్నివేశాన్ని మాత్రమే రాజమౌళి అద్భుతంగా చూపించనున్నారట. 

ఈ ఎపిసోడ్ మొత్తం కేవలం ఒక్క సీక్వెన్స్ చుట్టూనే ఎంతో పవర్‌ఫుల్‌గా తిరుగుతుందని తెలుస్తోంది. అదే.. రాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే మహా యుద్ధం. రాముడిగా మహేష్ బాబు గ్లోరీ అప్పీరియన్స్, ఆ దివ్య రూపం, ఆ బాణాల వర్షం... వీటన్నింటినీ ఒక విజువల్ వండర్‌లా రాజమౌళి స్క్రీన్ మీద ప్రెసెంట్ చేయబోతున్నారు. ఈ పర్టికులర్ చాప్టర్‌లో కేవలం శ్రీరాముడు, కుంభకర్ణుడు, ఆంజనేయ స్వామి, వానర సేన మాత్రమే ఉంటారట.

కొండంత ఆకారంతో ఉన్న కుంభకర్ణుడు ఒకవైపు... విల్లు చేతబూని, దైవికమైన తేజస్సుతో శ్రీరాముడిగా మహేష్ బాబు ఇంకోవైపు. పక్కనే హనుమంతుడి గర్జన, వానర సేన హుంకారం. ఈ ఒక్క ఎపిసోడ్‌కే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని చెప్పవచ్చు. 

రాజమౌళి ఒక పర్టికులర్ రామాయణ చాప్టర్‌ను మాత్రమే ఎంచుకుని, దానికి గ్లోబల్ రేంజ్ విఎఫ్ఎక్స్, మైండ్ బ్లాకింగ్ యాక్షన్ కోరియోగ్రఫీ జోడించి ప్రజెంట్ చేయబోతున్నారు. అందుకే ఈ ఎపిసోడ్‌లో సీతమ్మ తల్లి, రావణాసురుడు లేదా ఇతర రామాయణ పాత్రలు కనిపించవట.

 

 

SS Rajamouli, Mahesh Babu, Varanasi, Ramayana Episode

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.