Home  »  News  »  The odyssey: ది ఒడిస్సీ కలెక్షన్ల సునామీ.. వరల్డ్ వైడ్ గా మూడురోజులకి ఎంతంటే!

Updated : Jul 20, 2026

 

ప్రపంచ సినీ ప్రేమికుల ఫేవరేట్ మూవీగా పిలవబడుతున్న 'ది ఒడిస్సీ' (The odyssey)మొన్న 17 న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఎలాంటి గ్రాఫిక్స్ జోలికి వెళ్లని వరల్డ్ లెజండ్రీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మేధస్సు నుంచి పుట్టిన ది ఒడిస్సి ని చూడటానికి సినీ ప్రేమికులు ఉదయం ఆట నుంచే బారులు తీరారు. ఇప్పటికి ఇంగ్లీష్ వెర్షన్ కి సంబంధించిన టికెట్స్ దొరకని పరిస్థితి. 


 విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే  $264.1 మిలియన్ల డాలర్లు అంటే 2 ,546 కోట్లు సాధించి  బాక్సాఫీస్ వద్ద పెను విధ్వంసం సృష్టించింది. దీంతో దర్శకుడు నోలన్ కెరీర్‌లోనే ‘ఒపెన్‌హైమర్’, ‘ది డార్క్ నైట్ రైజెస్’వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల రికార్డులని  అధిగమించి, అత్యధిక గ్లోబల్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘ది ఒడిస్సీ’ సరికొత్త మైలురాయిని చేరుకుంది.  నార్త్ అమెరికాలోనే సుమారు $124.5 మిలియన్ల భారీ వసూళ్లను సాధించగా, అంతర్జాతీయ మార్కెట్ల నుండి మరో $139.6 మిలియన్లను కొల్లగొట్టింది. భారతీయ బాక్సాఫీస్ విషయానికి వస్తే, నోలన్ మ్యాజిక్  వర్కవుట్ అయింది. మొదటి రోజు ఇండియాలో 17.40 కోట్ల నెట్  వసూళ్లతో శుభారంభం చేసిన ఈ చిత్రం, రెండో రోజు శనివారం  22 కోట్ల నెట్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్లు . 39.4 కోట్లకు చేరగా, గ్రాస్ వసూళ్లు  47.03 కోట్లు దాటాయి. వీకెండ్ ముగిసే సమయానికి మూడు రోజుల్లోనే ఇండియాలో ఏకంగా 70 కోట్ల గ్రాస్ మార్కును దాటి, ఇండియాలో క్రిస్టోఫర్ నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. మన దగ్గర  మొదటి రోజు 8,413 షోలతో ప్రారంభమై, మరుసటి రోజు డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా 8,791 షోలలో ప్రదర్శితమైంది. 

also read: రాకాలో తెలుగు బ్యూటీ

ఇండియాలో ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్  13.75 కోట్ల నెట్ వసూళ్లతో అగ్రస్థానంలో నిలవగా, హిందీ వెర్షన్  1.90 కోట్లు, తెలుగు వెర్షన్  1.10 కోట్లు, తమిళ వెర్షన్ . 65 లక్షల నెట్ వసూలు చేశాయి. ఐమాక్స్ స్క్రీన్లలో దాదాపు 74 శాతం అక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే మరియు జెండయా వంటి భారీ తారాగణంతో హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు పురాణ కావ్యం ఆధారంగా ఒడిస్సిని  తెరకెక్కించారు. పూర్తి స్థాయిలో ఐమాక్స్  కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. సుమారు 2,080 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
the odyssey, christopher nolan






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.