Home  »  News  »  'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ రెస్పాన్స్.. కిరణ్ అబ్బవరం సరికొత్త కల్ట్ క్లాసిక్ లవ్ జర్నీ.!

Updated : Jul 20, 2026

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్యూర్ రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాల ట్రెండ్ అవుతోంది. 'బేబీ' సినిమాని నిర్మించిన మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్ బ్యానర్లపై SKN, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. 

గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే 'చెన్నై లవ్ స్టోరీ'పై మంచి అంచనాలు ఉండగా, ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను పెంచేసింది. జూలై 24న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం, యువతను విశేషంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం 'స్టీఫెన్' అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా దర్శకుడిగా రాణించాలనే బలమైన కోరికతో, హైదరాబాద్ కాకుండా సరికొత్త భావోద్వేగాల కోసం చెన్నైను ఎంచుకునే ఒక వైవిధ్యమైన పాత్ర ఇది. ఈ ప్రయాణంలో అతనికి ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన శ్రీ గౌరిప్రియ పరిచయం అవుతుంది. చాలా ఫ్రీడమ్ కోరుకునే, స్వేచ్ఛగా బతికే అమ్మాయిగా గౌరిప్రియ పాత్రను చాలా సహజంగా డిజైన్ చేశారు. వీరిద్దరి మధ్య మొదట చిన్న చిన్న గొడవలతో ప్రారంభమైన పరిచయం, ఆ తర్వాత గాఢమైన ప్రేమగా ఎలా మారింది అనేది ట్రైలర్‌లో చాలా అందంగా చూపించారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ట్రైలర్ మొదటి సగం అంతా ఎంతో ఆహ్లాదకరంగా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోగా, ద్వితీయార్ధంలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య వచ్చే తేడాలు, స్వతంత్రంగా ఉండే అమ్మాయి అలవాట్లను స్టీఫెన్ అంగీకరించలేకపోవడం వంటి అంశాలు వీరి మధ్య తీవ్రమైన ఎమోషనల్ ప్యాక్డ్ డ్రామాకు దారితీస్తాయి. ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో, విడిపోతే వచ్చే గుండెకోత అంతకంటే తీవ్రంగా ఉంటుందని ట్రైలర్ లోని ఎమోషనల్ సీన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ట్రైలర్‌లోని భావోద్వేగాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. విజువల్స్ కూడా ఎంతో రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉండి సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లో 1.5 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడమే కాకుండా, యూట్యూబ్ లో టాప్-2 లో ట్రెండ్ అవుతోంది. చూస్తూనే కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడేలా ఉంది.

 

 

Chennai Love Story Trailer, Kiran Abbavaraam, Sri Gouri Priya

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.