![]() |
![]() |

సత్యదేవ్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రావు బహదూర్'(Rao Bahadur)సైకాలజికల్ డ్రామాగా తెరకెక్కగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సమర్పించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. విడుదలకు ముందే ప్రైవేట్ స్క్రీనింగ్‌లో ఈ సినిమా చూసిన మహేష్ బాబు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఇక ఈ రోజు ఉదయం నుంచే ప్రీమియర్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ అభిప్రాయాలని పంచుకుంటున్నారు. అసలు ఈ 'రావు బహదూర్' కథేంటి, ట్విట్టర్ యూజర్లు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం.
రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) అనే 60 ఏళ్ల వృద్ధుడు ఒక తీవ్రమైన శారీరక రుగ్మతతో బాధపడుతుంటాడు. వైద్యులు చెప్పిన గడువు దాటిపోయినా, తను అనుకున్న ఒక వ్యక్తిగత లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటాడు. దాదాపు పక్షవాతం వచ్చిన స్థితిలో కూడా తన చుట్టూ ఉన్న వారి సహాయంతో తన లక్ష్యాన్ని ఎలా పూర్తి చేశాడు అనేదే ప్రధాన కథాంశం. ఈ ప్రయాణంలో రేణుక (దీప థామస్)తో ప్రేమ, యువకుడిగా ఉన్నప్పటి జ్ఞాపకాలు, భావోద్వేగాలు ప్రేక్షకులని కట్టిపడేస్తాయి.
Also read: OG 2: ఓజి 2 స్టోరీ లీక్!
కుల వ్యవస్థ, చర్మం రంగు, రక్తసంబంధాలు, సామాజిక మూఢనమ్మకాలపై దర్శకుడు వెంకటేష్ మహా వేసిన సెటైర్లు, ఫిలాసఫికల్ టచ్ ప్రధాన బలంగా నిలిచాయి. ట్విట్టర్ టాక్ ప్రకారం, సినిమా ఓపెనింగ్ 5 నిమిషాల నుంచే ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టిస్తుంది. మొదటి 30 నిమిషాలు రామప్ప రావు బహదూర్ ప్రపంచంలోకి, అతని భువనాలయంలోకి, అక్కడి యాసలోకి వెళ్లడానికి ప్రేక్షకులకి కొంచెం సమయం పట్టినప్పటికీ, ఆ తర్వాత కథలో లీనమైపోతారు. ఫస్ట్ హాఫ్ అంతా నెమ్మదిగా పాత్రల పరిచయం, వరల్డ్ బిల్డింగ్‌తో సాగుతుంది. అయితే ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులలో తీవ్ర ఉత్సుకతను రేకెత్తిస్తుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా సత్యదేవ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో డ్రామా మరింత తీవ్రమవడమే కాకుండా, క్లైమాక్స్ ట్విస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. చివరి 25 శాతం సినిమా 'పీక్ సినిమా' అని, టాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని సరికొత్త ప్రయోగమని నెటిజన్లు కొనియాడుతున్నారు.
Rao Bahadur Twitter Review, Rao Bahadur Movie Review, Satyadev in rao Bahadur, Venkatesh Maha, Rao Bahadur Rating
![]() |
![]() |