![]() |
![]() |

-సినిమాపేరు: నాగబంధం
-నటీనటులు: విరాట్ కర్ణ, నభ నటేష్ ,ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మురళి శర్మ, రిషభ్ సావ్నీ, మహేష్ -మంజ్రేకర్, సోనియా సింగ్ తదితరులు
-సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్
-ఎడిటింగ్: ఆర్ సి ప్రణవ్
-మ్యూజిక్: జునైద్ కుమార్, అభి
-నిర్మాతలు: కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి
-బ్యానర్స్ : నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్
-రచన,దర్శకత్వం: అభిషేక్ నామ
-రిలీజ్ డేట్ : జులై 3 ,2026
ఈ మధ్య కాలంలో ప్రచార చిత్రాలతో అభిమానుల్ని దక్కించుకున్న మూవీ 'నాగబంధం'. నిన్న ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
శ్రీరంగంలో కొలువుతీరిన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరంగనాధుడిది పడకశయలో(అనంత పద్మనాభస్వామిలా) ఉండే సుందర మనోహరమైన రూపం. ఆ రూపాన్నిచూస్తే చాలు పాపాలు పటాపంచలవుతాయనే విధంగా ఉంటుంది. ఆయన నాభిలో ఉండే బ్రహ్మ కమలం ప్రత్యేక ఆకర్షణ. శ్రీరంగనాధుడికే సంబంధించి నాగబంధం వేసి ఉన్న మరో గది అత్యంత శక్తివంతమైనది. హిమాలయాల్లో యుగయుగాల నుంచి బైరాగి(రామచంద్ర రాజు) అనే క్షుద్ర శక్తి రూపం తన లక్ష్యం కోసం ఎదురు చూస్తుంటాడు. రుద్ర( విరాట్ కర్ణ) పూర్వజన్మలో పరమేశ్వరుడిని ప్రాణానికి ప్రాణంగా ఆరాధించే నాగ సాధువు. ప్రస్తుతం అనాధ అయినా ఒక కుటుంబం రుద్రని తన సొంత బిడ్డలా చూసుకుంటూ ఉంటుంది. పార్వతి(నభ నటేష్) భారత ప్రభుత్వంలో పని చేసే ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతి బాబు) కూతురు. పార్వతిని ప్రభాకర్ శ్రీరంగ నాధుడు గుడి వంశపారంపర్య అర్చకుడు(మురళి శర్మ) దగ్గర ఒక పనిపై చేర్పిస్తాడు. అబ్దాలీ(రిషభ్ సావ్నీ) భగవంతుడ్ని సైతం ఎదిరించే పరమ నీచుడు. తన కోరిక నెరవేరడానికి పసి పిల్లలని సైతం నిర్దాష్యంగా చంపుతాడు. పైన చెప్పుకున్న ఆ క్యారెక్టర్స్ మొత్తానికి నాగబంధంకి ఉన్న సంబంధం ఏంటనేదే చిత్ర కథ.
ఎనాలసిస్
శ్రీ మహా విష్ణువుకి , పరమేశ్వరుడికి మధ్య ఉన్న లింక్ ని చెప్పడం అంటేనే ఎంతో ఆసక్తికరమైన, ఇంట్రస్ట్ కలిగించే కథ. కానీ కథనాన్ని ఇంట్రెస్ట్ గా చెప్పలేకపోయారు. అనవసరం కలిగించే సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి రుద్ర చెల్లెలి సెంటిమెంట్. పైగా చాలా సీన్స్ లో పూర్తి విషయం చెప్పకుండా కట్ చేసేసారు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మొదటి పావుగంట ఎంతో ఇంట్రస్ట్ గా ఉంది. ఆ తర్వాత వచ్చిన రుద్ర సీన్స్ తో పాటు ఫ్యామిలి సీన్స్ క్లిక్ కాలేదు. ఫ్యామిలీకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ అయితే బాగుంది.
శ్రీరంగస్వామి ఆలయ సన్నివేశాలు, పూజారిగా మురళి శర్మ క్యారక్టరయిజేషన్, టెంపుల్ లోని సాంగ్ సూపర్. బ్రహ్మ కమలాన్ని మాములు వస్తువులా తాళం తీసుకొని దొంగతనం చెయ్యడం అనేది నర్మల్ గా కాకుండా భారీ హంగామాతో చెప్పి ఉండాల్సింది. ప్రభాకర్ సీన్స్ పర్లేదు. అబ్దాలీ, భైరాగి సీన్స్ రొటీన్. బ్రహ్మ కమలాన్ని రుద్ర తీసుకొస్తానని అనడం లాజిక్ లేని విధంగా ఉండటంతో పాటు దెబ్బలు తినడం కోసమే రుద్ర క్యారక్టర్ ని చూపించినట్టుగా ఉంది.ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. పైగా రుద్రని శివుడిగా త్రిశూలం, పాము ధరించి చూపించడంతో సెకండ్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటుందని ఉహించుకుంటాం. కానీ నిరుత్సాహ పరిచే కథనంతో కూడిన సీన్స్ వస్తుంటాయి.
పార్వతి చెప్పే ఫ్లాష్ బ్యాక్ రొటీన్.. నాగసాధువుగా రుద్రని పవర్ ఫుల్ సీన్స్ తో ఎస్టాబ్లిష్ చెయ్యలేదు. పాపతో వచ్చిన సీన్స్ కూడా రొటీన్. శ్రీరంగం గుడిని చుట్టుముట్టి ముస్లిమ్ చక్రవర్తిగా 1760 వ సంవత్సరంలో ఉన్న అబ్దాలీ భక్తులని చంపే సీన్స్ మెప్పించాయి. నాగ బంధం గురించి చెప్పకుండానే రెండవ పార్ట్ లో మిగిలిన కథ ఉంటుందని చెప్పడం నిరుత్సాహ పరుస్తుంది.
నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు
విరాట్ కర్ణ, నభ నటేష్, జగపతిబాబు, మురళి శర్మ నుంచి మూవీలో చేసిన ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. కానీ నెగిటివ్ రోల్స్ చేసిన రిషభ్ సావ్నీ, రామచంద్ర రాజు మాత్రం పెర్ఫార్మ్ విషయంలో పెద్దగా మెప్పించలేకపోయారు. ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్ , ఫొటోగ్రఫీ, ఆర్ ఆర్, నిర్మాతలు అతి పెద్ద బలం. పంచభూతాల్లాంటి ఆ ఐదు అంశాలు లేకపోతే నాగ బంధం లేదు అనేలా మెస్మరైజ్ చేసాయి. అభిషేక్ నామ దర్శకుడిగా,రచయితగా న్యాయం చెయ్యలేకపోయాడు.
బలాలు
1 . కథ
2 . శ్రీరంగం టెంపుల్ సెట్
3 . ఫొటోగ్రఫీ
4 .బ్యాక్ గ్రౌండ్ స్కోర్
5 .ఇంటర్వెల్ ఎపిసోడ్
బలహీనతలు
1 . కథనం నడిచిన విధానం
2 . హీరో క్యారక్టర్ ని మలిచిన విధానం
3 . సెకండ్ హాఫ్
4 . రైటింగ్
5 . డైరెక్షన్
చివరిగా చెప్పాలంటే విజువల్ గా మాత్రమే నాగబంధం మెప్పించింది.
రేటింగ్ 2 .25 /5 అరుణాచలం
![]() |
![]() |