Home  »  News  »  Honey Rose: హనీ రోజ్ కి షాక్ ఇచ్చిన ప్రముఖ బిజినెస్ మెన్ 

Updated : Jun 30, 2026

 

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)తో వీరసింహ రెడ్డిలో జత కట్టి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన భామ హనీ రోజ్. మలయాళ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం నుంచి పలు సినిమాల్లో చేస్తు వస్తున్న హనీ రోజ్ పై ప్రముఖ మలయాళ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ తీవ్ర  అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసాడు. ఈ విషయంలో హనీ రోజ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటం చేస్తుంది.


తాజాగా  సోషల్ మీడియా వేదికగా హనీ రోజ్(Honey Rose)స్పందిస్తూ, నా వ్యాఖ్యల వల్ల హనీ రోజ్ తో paatu ఆమె కుటుంబం తీవ్ర మనోవేదనకు గురయ్యారని గ్రహించాను. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. ఎప్పుడూ ఇతరులని  నొప్పించే వ్యక్తిని కాను. కేవలం హాస్యం కోసమే అలా మాట్లాడాను.  కానీ అది ఇంత పెద్ద వివాదానికి దారితీస్తుందని అనుకోలేదు. తను నాపై పెట్టిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా అభ్యర్థించారు. హనీ రోజ్  ఆగస్టు 2024లో కన్నూర్‌లోని అలకోడ్‌లో బాబీ చెమ్మనూర్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆమెపై బాబీ లైంగిక వేధింపుల తరహాలో, మహిళా గౌరవానికి భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై హనీ రోజ్ తీవ్రంగా స్పందిస్తూ 2025 జనవరిలో ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 75(1)(4) మరియు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా బాబీని జనవరి 2025లోనే కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో బాబీతో పాటు సోషల్ మీడియాలో ఆమెను కించపరుస్తూ అశ్లీల థంబ్‌నైల్స్ పెట్టిన మరో 20 మందికి పైగా వ్యక్తులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.


Also read: Ntr: ఎన్టీఆర్ మూవీ నుండి తమన్ అవుట్.. త్రివిక్రమ్ మైండ్ గేమ్ అదేనా?


ఆ సమయంలో హనీ రోజ్ సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇస్తూ, "మీకు డబ్బు అండ ఉండొచ్చు, కానీ నాకు భారత న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది" అని స్పష్టం చేశారు. ఈ కేసు కేరళ హైకోర్టు వరకు వెళ్ళింది. కోర్టు సైతం బాబీ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన గతంలోనే న్యాయస్థానానికి కూడా క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా బాబీ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన క్షమాపణల లేఖను ఉంచడంతో ఈ వ్యవహారంపై హనీ రోజ్ స్పందించారు.

బాబీ చెమ్మనూర్ ఆత్మాభిమానంతో చేసిన క్షమాపణను తాను, తన కుటుంబం స్వీకరిస్తున్నట్లు హనీ రోజ్ మలయాళ మీడియాతో పేర్కొన్నారు. ఎవరికీ కీడు చేయాలనే ఉద్దేశం తమకు లేదని, ప్రారంభంలోనే ఆయన 'సారీ' చెప్పి ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదని ఆమె అన్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.