Home  »  News  »  Ntr: ఎన్టీఆర్ మూవీ నుండి తమన్ అవుట్.. త్రివిక్రమ్ మైండ్ గేమ్ అదేనా?

Updated : Jun 30, 2026

 


మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో 'గాడ్ ఆఫ్ వార్' చిత్ర అధికార ప్రకటన నిన్న వచ్చిన విషయం తెలిసిందే. లార్డ్ మురుగన్ (కార్తికేయ) కథాంశంతో, నార్త్ నుండి సౌత్ వరకు విశ్వవ్యాప్తంగా కనెక్ట్ అయ్యేలా భారీ బడ్జెట్‌తో  నిర్మిస్తున్నారు. ఈ మూవీ  ప్రకటన రాకముందు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత నాగవంశీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ను తమన్ రీపోస్ట్ చేయడంతో, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తమనే సంగీతం అందిస్తాడనే నమ్మకంతో అందరూ ఉన్నారు. కొన్నాళ్ల క్రితం తమన్ కూడా తను 'గాడ్ ఆఫ్ వార్' చిత్రానికి వర్క్ చేయబోతున్నట్లు పరోక్ష సంకేతాలిచ్చారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ కాంబినేషన్‌కి  ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత వీర రాఘవ', 'గుంటూరు కారం' వంటి సినిమాలు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా తమన్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ త్రివిక్రమ్ సినిమాలని  మరో స్థాయికి తీసుకెళ్లేది. అయితే, ఈ విజయవంతమైన జోడీ మధ్య ఇటీవల కొన్ని ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొదట విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' సినిమా నుండి తమన్‌ ని  పక్కన పెట్టి, 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ని ఎంపిక చేయడంతో ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల పుకార్లు షురూ అయ్యాయి. ఆ సమయంలో తమన్ స్వయంగా స్పందిస్తూ, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం కొత్త టీమ్‌తో ప్రయోగం చేయాలనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని క్లారిటీ ఇచ్చారు.


Also read: Brigida saga: ప్రియుడ్ని పరిచయం చేసిన పెదకాపు హీరోయిన్.. తెలుగు దర్శకుడు కాదు 

కట్ చేస్తే, నిన్న విడుదలైన అధికారిక పోస్టర్‌లో సంగీత దర్శకుడిగా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పేరు ప్రత్యక్షమవడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. 'ఆదర్శ కుటుంబం' సినిమాకు బ్రేక్ ఇచ్చినా, ఎన్టీఆర్ లాంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులో తమన్ ఖచ్చితంగా ఉంటాడని ఆశించిన ఇండస్ట్రీ వర్గాలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. గతంలో ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత'కు తమన్ అద్భుతమైన ఆల్బమ్, అంతకంటే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన ట్రాక్ రికార్డ్ ఉంది. అయినప్పటికీ, ఈ మైథలాజికల్ వార్ డ్రామా కోసం త్రివిక్రమ్ అనిరుధ్‌ వైపే మొగ్గు చూపడం వెనుక తెరవెనుక చాలా పెద్ద చర్చలే నడిచినట్లు తెలుస్తోంది. పాన్-ఇండియా మార్కెట్‌లో అనిరుధ్ మ్యూజిక్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్, అలాగే లార్డ్ మురుగన్ బ్యాక్‌డ్రాప్ కథ కావడంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ రీచ్ కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టుల్లో త్రివిక్రమ్ తనను పక్కన పెట్టడం తమన్ కెరీర్‌లో ఒక ఊహించని ట్విస్ట్‌గా మారింది. ముఖ్యంగా తమన్ అభిమానులని  తీవ్ర షాక్ కి గురిచేసింది.

 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.