![]() |
![]() |

చిరంజీవి(chiranjeevi )అభిమానిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నమ్ముకుని, వాటిని భారీ విజయాలుగా మలిచే టాలెంటెడ్ టేస్ట్‌ఫుల్ నిర్మాతగా మారాడు ఎస్‌కేఎన్. 'ఈ రోజుల్లో' మూవీతో కో ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' వంటి విజయవంతమైన చిత్రాల్లో భాగస్వామిగా నిలిచారు. ముఖ్యంగా 2023లో వచ్చిన 'బేబీ' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించి, దాదాపు 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేశారు. కేవలం నిర్మాతగానే కాకుండా, ఇండస్ట్రీ సమస్యలపై సోషల్ మీడియాలో నిలదీసే పవర్‌ఫుల్ పర్సనాలిటీగా ఆయనకు గుర్తింపు ఉంది. సినిమా ప్రమోషన్లలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, తనదైన బోల్డ్ స్టేట్‌మెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఎస్‌కేఎన్, ఇప్పుడు తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేయబోతున్నారు. నిర్మాత కుర్చీ నుంచి కెమెరా ముందుకు వచ్చి, నటుడిగా టాలీవుడ్‌కి పరిచయం కానున్నారు.
'మసూద', 'పలాస 1978', 'జార్జ్ రెడ్డి', అలాగే 2026 లేటెస్ట్ హిట్ 'పాపం ప్రతాప్' చిత్రాలతో వర్సటైల్ యాక్టర్‌గా, హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్. ప్రస్తుతం తిరువీర్ హీరోగా, కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా ఒక సరికొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో సాగే అవుట్ అండ్ అవుట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో నిర్మాత ఎస్‌కేఎన్ ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఒక పక్క పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలను ప్లాన్ చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమాలో పాత్రకున్న ప్రాధాన్యత నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్‌కేఎన్ పోషించబోయే క్యారెక్టర్ కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సమాచారం.
Also read: Varanasi: తండ్రి కొడుకుల ఎమోషన్!.. వారణాసి బిగ్ అప్డేట్
![]() |
![]() |