Home  »  News  »  దసరా రేస్ నుండి 'NBK 111' తప్పుకుందా? అసలు నిజం ఇదే!

Updated : Jun 29, 2026

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK 111' చిత్రంపై తెలుగు సినీ వర్గాల్లో, ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్స్ మొదలయ్యాయి. 

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా 2026 అక్టోబర్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. కానీ, షూటింగ్ ఆలస్యమవ్వడంతో డిసెంబర్ కి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టుగానే దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

'NBK 111' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే కాకినాడలో ఒక భారీ షెడ్యూల్ జరగనుంది. ఆ షెడ్యూల్ సినిమాకు కీలకమైన పవర్ ఫుల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లు షూట్ చేయనున్నారట. కాకినాడ షెడ్యూల్ తో మేజర్ షూటింగ్ పూర్తవుతుందని వినికిడి.

'NBK 111' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్, క్యారెక్టరైజేషన్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయని ఇప్పటికే విడుదలైన బర్త్‌డే గ్లింప్స్ స్పష్టం చేసింది. అందులో బాలయ్య స్టైలిష్ ఎనర్జీ, ఎలెక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.