Home  »  News  »  vaishnav tej: 100 కథలు రిజెక్ట్ చేసి కొత్త సినిమాని లైన్ లో పెట్టిన  వైష్ణవ్ తేజ్

Updated : Jun 5, 2026

 

మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం 'ఉప్పెన'తో  బ్లాక్‌బస్టర్ హిట్ ని అందుకోవడమే కాకుండా  వంద కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత చేసిన కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ' వరుస డిజాస్టర్స్ గా నిలవడంతో ఈ సారి హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.


దీంతో  గత మూడేళ్లుగా సరైన కథ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఈ క్రమంలో 100 కి పైగా స్క్రిప్ట్‌లను విన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు మహేష్ చెప్పిన ఒక వైవిధ్యమైన లైన్ వైష్ణవ్ తేజ్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ కథలో ఉన్న కొత్తదనం, క్యారెక్టరైజేషన్ తన కమ్‌బ్యాక్‌కి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని భావించి  వెంటనే ఓకే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.

Also read: Vijay: జన నాయగన్‌ కి బిగ్ షాక్.. థియేట్రికల్ డీల్స్ మొత్తం క్యాన్సిల్ 

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని  టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్' (AK Entertainments) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. వైష్ణవ్ తేజ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్‌తో రూపొందే చిత్రంగా నిలవబోతోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.