![]() |
![]() |
- శ్రీలీల వెనకబడిపోవడానికి రీజన్ ఏంటి?
- శ్రీలీలకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా?
- ‘పరాశక్తి’ సినిమా శ్రీలీలకు ప్లస్ అయిందా?
టాలీవుడ్‌లో మెరుపులా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఒకటి, రెండు సినిమాలతోనే తనేమిటో వ్రూవ్ చేసుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకొని వరస అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడం ఆమె కెరీర్‌ను ఇరకాటంలో పెట్టింది. రవితేజతో చేసిన ధమాకా సినిమా ఒక్కటే సక్సెస్ అవ్వడం, ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల చేసిన డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ అది ఆమె కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. అలాగే భగవంత్ కేసరి చిత్రంలో ఆమె పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకున్నప్పటికీ అందులో ఆమె హీరోయిన్ కాకపోవడం కూడా కెరీర్‌కి మైనస్‌గా మారింది. టాలీవుడ్‌లో లాభం లేదనుకొని కోలీవుడ్‌కి వెళ్లి తన లక్‌ను పరీక్షించుకుందామనుకుంది. అయితే అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది.
తెలుగు, కన్నడ సినిమాల్లో తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 15 సినిమాల్లో నటించిన శ్రీలీలకు స్టార్ డమ్ తెచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు. తాజాగా తమిళ్‌లో చేసిన పరాశక్తి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. జనవరి 10న విడుదలైన ఈ సినిమాలో రత్నమాలగా నటించింది. ఈ సినిమా కోసం తన లుక్‌ని మార్చడమే కాకుండా పెర్‌ఫార్మెన్స్ పరంగా ఎంతో కష్టపడింది. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. తమిళ ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకోలేకపోయింది.
దీన్నిబట్టి శ్రీలీలకు బ్యాడ్ టైమ్ నడుస్తోందనేది అర్థమవుతోంది. అయితే తన నటననుగానీ, డాన్స్‌ను గానీ తప్పు పట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఆ విషయంలో తనేమిటో ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదని, తప్పకుండా ఓ భారీ హిట్ ఆమె ఖాతాలోకి వస్తుందని అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. అందుకే ఓ బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావాలని శ్రీలీల కలలు కంటోంది. మరి ఆమె కలలు ఎప్పటికి నిజం అవుతాయో చూడాలి.
![]() |
![]() |