పవన్ కళ్యాణ్(pawan kalyan)హీరోగా 2011 లో వచ్చిన 'పంజా' మూవీతో నటుడుగా మంచి గుర్తింపుని పొందిన అడవి శేషు(adavi seshu)ఆ తర్వాత హీరోగా క్షణం,గూఢచారి,ఎవరు,మేజర్,హిట్ ది సెకండ్ కేస్ వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ ని సృష్టించుకున్నాడు.ప్రస్తుతం'డెకాయిట్' అనే విభిన్నమైన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు.
రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయ్యింది.తనని కాపాడినా కానీ,ఒదిలేసినాది తను ఏంటో అసలెవరో రేపు తెలుస్తాది.'అంటూ అడివి శేష్ డెకాయిట్ లోని హీరోయిన్ని పరిచయం చేస్తున్నాడు.కాకపోతే హీరోయిన్ ముఖం రివీల్ కాకుండా కేవలం కళ్ల వరకు కనిపించేలా పోస్టర్ ఉండటంతో ఆ హీరోయిన్ ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గతంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేస్తుందని మేకర్స్ ప్రకటించారు. పైగా అడవి శేషు,శృతి మధ్య టీజర్ కూడా రిలీజై సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో పాటు సినిమాపై ఆసక్తిని కూడా కలిగించింది. కానీ ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.భీమ్స్ సిసిరోలియో సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఎస్ఎస్ క్రియేషన్స్,అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.షేనియల్ డియో దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.