సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న అల్లు అర్జున్(allu arjun)ఆ మరుసటి రోజే బెయిల్ పై బయటకి వచ్చిన విషయం తెలిసిందే.ఇక జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ ని సినిమా ఇండస్ట్రీకి చెందిన అందరు కూడా వెళ్లి పరామర్శించారు.మరి కొంత మంది ఫోన్ లు కూడా చెయ్యడం కూడా జరిగింది.
ఇక అల్లు అర్జున్ నిన్న తన భార్య స్నేహరెడ్డి తో కలిసి మెగా స్టార్ చిరంజీవి(chiranjeevi)నివాసానికి వెళ్లి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల గురించి వివరించాడు.ఈ సందర్భంగా చిరు, అల్లు అర్జున్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ కూడా చేస్తున్నాయి.ఇప్పుడు పవన్ కళ్యాణ్(pawan kalyan)ని కూడా కలవడానికి అల్లు అర్జున్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటుగా తెలుస్తుంది.ఇందు కోసం ఏపి కి వెళ్ళడానికి కూడా అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు రాత్రే పవన్ హైదరాబాద్ వచ్చాడనే వార్తలు వచ్చాయి.దీంతో పవన్ ఆ మరుసటి రోజు అల్లు అర్జున్ ని కలుస్తాడని అందరు అనుకున్నారు.కానీ మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కి కొన్ని అధికార ప్రోగ్రామ్స్ ఉండటంతో వెళ్ళిపోయాడు.అందుకే ఇప్పుడు అల్లు అర్జునే ఏపి వెళ్ళబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.నాగబాబు ని కూడా అల్లు అర్జున్ కలిసి అరెస్ట్ పరిణామాలని వివరించడం జరిగింది.